చిరంజీవి ఆచార్య కోసం రాం చరణ్ ఇండియాలోనే కనిపించని టెంపుల్ ని నిర్మించాడు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

చిరంజీవి ఆచార్య కోసం రాం చరణ్ ఇండియాలోనే కనిపించని టెంపుల్ ని నిర్మించాడు ..!

 Authored By govind | The Telugu News | Updated on :6 January 2021,7:15 pm

చిరంజీవి ఆచార్య .. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమా. సైరా తో చిరంజీవి పాన్ ఇండియన్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. అందుకే నెక్స్ట్ సినిమాగా రూపొందుతున్న ఆచార్య సినిమాని కూడా పాన్ ఇండియన్ సినిమాగానే నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

The largest temple town set in India for 'Acharya' ..!

ఇక ఈ సినిమాని రామ్ చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా .. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తండ్రి మెగాస్టార్ కోసం చరణ్ ఖర్చు కి ఏమాత్రం వెనకాడకుండా బడ్జెట్ ని కేటాయిస్తున్నాడు. ఇందుకు ఉదాహరణ తాజాగా మెగాస్టార్ ఈ సినిమాకోసం ఇండియాలో కనిపించని అతి పెద్ద టెంపుల్ సెట్ ని వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ టెంపుల్ సెట్ ని చూస్తే ఆచార్య సినిమాని ఎంత భారీగా నిర్మిస్తున్నారో అర్థమవుతోంది.

కాగా ఈ సినిమాని కొరటాల శివ దేవాదయ భూములు.. అలాగే నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు మెగాస్టార్ ఇమేజ్ కి క్రేజ్ కి ఏమాత్రం తగ్గకుండా మాస్ ఆడియన్స్ కి మెగా ఫ్యాన్స్ కి పవర్ ప్యాక్డ్ మూవీగా ఆచార్య ని తీసుకు రాబోతున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. కాగా మెగాస్టార్ ఆచార్య కోసం వేసిన టెంపుల్ ని నిర్మించిన ఆర్ట్ డైరెక్టర్.. దర్శకుడు కొరటాల శివ.. అలాగే నిర్మాత రాం చరణ్ – నిరంజన్ రెడ్డి లను ప్రశంసించారు.

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది