
Ram charan 15th project with Shankar
Ram charan : రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ సినిమా ప్రకటన రీసెంట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అని.. పొల్టికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే అవకాశాలున్నాయని.. రెండు జోనర్స్ గురించి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు జోనర్స్ లో జోనర్ అయినా రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా రికార్డ్స్ తిరగ రాయడం పక్కా అని అంటున్నారు.
కాగా ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులను ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అందరికి తెలిసిందే. శంకర్ ఒక్కో సాంగ్ కోసమే కోట్లలో ఖర్చు చేస్తుంటాడు. విజువల్ వండర్ గా సినిమాని సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరిస్తుంటాడు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ తీసుకునే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ప్రముఖంగా కియారా అద్వానీ, పరిణీతి చోప్రా ల పేర్లు పరిశీలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Ram charan 15th project with Shankar
కానీ అనూహ్యంగా ఈ భారీ ప్రాజెక్ట్ కి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ని ఎంపిక చేసున్నట్టు సమాచారం. అధికారకంగా ఈ విషయం వెల్లడి కాకపోయినప్పటికి రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చే ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాకి రష్మిక మందన్న అయితే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. మరి నిజంగా రష్మిక ఫైనల్ అయిందా లేదా అన్నది అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ఫైనల్ చేసినట్టు సమాచారం. కాగా ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ మీదకి వస్తుందని ఈ సారి శంకర్ ఎక్కువగా వీఎఫెక్స్ మీద దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.