Home » Entertainment » Ram Charan Do Big Projects
Entertainment

Ram Charan : రామ్ చరణ్ Next డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిద్ర కూడా పట్టదు..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 15, 2023, 12:00 pm
Advertisement

Ram Charan : తెలుగు పరిశ్రమలోకి చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం స్టార్ హీరో హోదా లో ఉన్నాడు. ఈమధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈ సినిమా తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ ఆచార్య ‘ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన తర్వాత తీయబోయే సినిమాలను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

Advertisement

అలాగే ఇటీవల అతను స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇక ఇటీవల రాంచరణ్ ఈ సినిమాలతో పాటు మరో కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల గ్లోబల్ అవార్డ్స్ కోసం అమెరికాకు వెళ్లిన రాంచరణ్ అక్కడ మీడియాకు తను నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు. 2023 మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని 2024లో మరో మూడు సినిమాలకు ఓకే చేసినట్లు చెప్పుకొచ్చాడు. అంటే మొత్తం ఆరు సినిమాలు వరకు లైన్లో ఉన్నాయని త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అనుకుంటున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

Ram Charan do big projects

Advertisement

అయితే రామ్ చరణ్ శంకర్, బుచ్చిబాబు సినిమాలను అయితే ఓకే చేశాడు. మిగిలిన నాలుగు ప్రాజెక్టులు ఎవరి దర్శకత్వంలో చేస్తాడో క్లారిటీ ఇవ్వలేదు. అందులో కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడా లిస్టులో ఉన్నట్లు సమాచారం. అలాగే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయబోతున్నట్లు టాక్. ఇక గౌతమ్ తిన్ననూరి తో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు మాట ఇచ్చాడు. వీళ్ళతోపాటు మరి కొంతమంది డైరెక్టర్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత రామ్ చరణ్ కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో బడా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి