Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అద్భుతమైన టాలెంట్ కల్గిన చరణ్ అదిరిపోయే సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని మెప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల మూవీ నుండి విడుదలైన సాంగ్ అభిమానులకి మంచి ఫీస్ట్ అందించింది. ఇక మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా రామ్ చరణ్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. మూవీని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఐదు ఇండియన్ భాషలలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. దసరా కానుకగా ఈ మూవీ వచ్చి ప్రేక్షకులని ఫుల్ ఎంటర్‌టైన్ చేయనుందని అంటున్నారు. ఇక రామ్ చరణ్‌కి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది.. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ చెర్రీకి డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13వ తేదీ న దానిని ప్రదానం చేశారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఈయనే అక్కడ అవార్డు అందుకున్నారు. తెలుగు సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గానే వేల్స్ యూనివర్సిటీ అందించినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా, పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమిళనాడు కి చెందిన ప్రముఖ ‘వెల్స్ యూనివర్సిటీ ‘రామ్ చరణ్’ ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు, చిన్న వయసులోనే ఇలాంటి పురస్కారం అందుకున్నందుకు ఒక కుటుంబ సభ్యుడిగా సంతోషిస్తూ మరియు ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను. చరణ్ బాబు ఇలాంటి మరెన్నో కీర్తి శిఖరాలని అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ… మీ బాబాయ్, నాగబాబు… అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.ఇక చిరంజీవి సైతం సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. వేల్స్ యూనివర్శిటీ తమిళనాడ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తున్న ప్రఖ్యాత విద్యాసంస్థ అని చిరంజీవి తెలిపారు. ఇది తనను ఓ తండ్రిగా ఎమోషనల్ గా, గర్వించేలా చేస్తుందని, ఆనందకరమైన క్షణమని అన్నారు. పిల్లలు విజయం సాధిస్తే అది తల్లిదండ్రులకి కూడా ఆనందమే అని చిరు తెలిపారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.