YS vijayamma : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ వైయస్ విజయమ్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంతవరకు ఏపీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండకుండా దూరంగా వెళ్లేందుకు ఆమె నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె విదేశాలకు పయనం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేంత వరకు తిరిగి దేశంలోకి అడుగుపెట్టేది లేదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికోసం ఆమె అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న మాటలు. అయితే విజయమ్మ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వైయస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు అని చెప్పాలి. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వైయస్ జగన్ వైసీపీ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. మరోసారి ముఖ్యమంత్రి కావాలని వైయస్ జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి ఆయన నెగ్గితే చాలు ఇక తిరుగు ఉండదు. కానీ ఓడితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విజయమ్మ కుమారుడు జగన్ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే ఆమె కుమార్తె షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి కడప గడ్డ నుండి జగన్ కు సవాల్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు పూర్తిగా సపోర్ట్ చేసిన విజయమ్మ ఏపీలోకి వచ్చిన తర్వాత మాత్రం షర్మిల ను పూర్తిగా పక్కన పెట్టేసారని చెప్పాలి. అంటే సొంత కొడుకు కూతురు ఈ విధంగా ఉండడం ఆమెకు ఇష్టం లేదని చెప్పాలి. అయితే విజయమ్మ కూడా జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారట. అదేవిధంగా జగన్ కి ఎదురుగా నిలబడుతున్న షర్మిలను కూడా దీవిస్తున్నారు. కానీ పూర్తి మద్దతు ఎవరికీ ఇవ్వాలో తేల్చుకోలేక ఇద్దరు బిడ్డల మధ్య షర్మిలమ్మ నలిగిపోతోంది.
ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు తమ పార్టీ తరుపున ప్రచారాలు చేయాల్సిందిగా కోరుతుంటే ఏదో ఒక పక్షాన ఉండడం విజయమ్మ కి అసలు ఇష్టం లేదు. దీంతో ఎవరి పక్షం ఉండకుండా తల్లిగా తన బిడ్డలు ఇద్దరు క్షేమాన్ని కోరుకుంటున్నారు విజయమ్మ. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉండటం కంటే విదేశాలకు వెళ్లి కొన్నాళ్లపాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని విజయమ్మ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తిరిగి ఆమె ఏపీలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ న్యూస్ విన్న నేటి జనులు ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మొత్తానికి విజయమ్మ ఈసారి ఏపీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు దేశాన్ని విడిచి దూరంగా వెళ్తున్నారన్నమాట.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.