Ram Charan : నువ్ హీరోయినా? అంటూ ఆశ్చర్యపోయిన రామ్ చరణ్.. సుమ దెబ్బకు షాక్
Ram Charan : యాంకర్ సుమ అంటే అందరికీ పంచ్‌లు, సెటైర్లు వేస్తూ సరదాగా ఉండే మనిషి అని ఫిక్స్ అయ్యారు. అది బుల్లితెర అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినా, సోషల్ మీడియాలో అయినా సరే సుమ అంటే ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్ అంటే సుమ అనేంతలా మారిపోయింది. అలాంటి సుమ ఇప్పుడు లేడీ సెంట్రిక్ చిత్రంలో నటిస్తోంది. జయమ్మ పంచాయితీ అంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుమ కోసం ముందుకువచ్చాడు.
రామ్ చరణ్ చేతుల మీదు సుమ మెయిన్ రోల్‌లో నటించిన జయమ్మ పంచాయితీ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు. ఈ మేరకు రామ్ చరణ్ వద్దకు చిత్రయూనిట్ వెళ్లింది. ఇందులో సుమ చేసిన అల్లరి మామూలుగా లేదు. సినిమా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చింది. డైరెక్టర్, నిర్మాత, డీఓపీ అంటూ అందరి గురించె చెప్పింది. అలా సుమ చెప్పగానే రామ్ చరణ్ సెటైర్ వేశాడు. ఏదైనా ఈవెంట్ ఉందా? అని అన్నాడు. ఈవెంట్ కాదు అని సుమ అంది.
Ram Charan : సుమ పరువుతీసిన రామ్ చరణ్
మీకు తెలిసిన అబ్బాయి ఎవరైనా హీరోగా నటిస్తున్నాడా? అని రామ్ చరణ్ మరో డైలాగ్ వేశాడు. ఈ చిత్రంలో హీరో ఉండడు. అంటే హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మా? అని అంటాడు. అవును అలాంటిదే అని సుమ అంటుంది. ఇంతకీ హీరోయిన్ ఎవరు అని రామ్ చరణ్ అంటాడు. హీరోయిన్ నేనే అని సుమ అంటుంది. ఏంటి మీరు హీరోయినా? అని రామ్ చరణ్ ఆశ్చర్యపోతాడు. అంటే మీరు హీరోయిన్‌గా చేయకూడదు అని కాదు కానీ మిమ్మల్ని మేమంత ఇన్ని రోజులు యాంకర్‌గా చూశాం కదా? అని అంటాడు. హీరోయిన్ అంటే పదహారు, పద్దెనిమిదేళ్లే ఉండాలని రూల్ లేదు కదా? నాలా 26 ఏళ్లు ఉన్నా సరిపోతుందికదా? అని సుమ కౌంటర్ వేయడంతో రామ్ చరణ్ నవ్వేస్తాడు.