Ram Charan : ఇంటికి పిలిచి మ‌రి బంగారు కాయిన్స్ బ‌హుమ‌తిగా ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంచి సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ఆయ‌న సినిమాలు దాదాపు స‌క్సెస్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి.. రాజమౌళి దర్శకత్వంలో చేసినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న తన 15వ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నాడు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన ఆర్ఆర్ఆర్ చిత్రం తొమ్మిది రోజుల్లోనే 800 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది .ఇంత భారీ విజ‌యం సాధించిన ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న

రామ్ చరణ్ తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్‌ని ఇంటికి పిలిచి మరీ బహుమతులు ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.ఈ సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ రోజు (ఆదివారం) ఉదయం అల్పాహారం కోసం పిలిచి వారందరికీ ఊహించని బహుమతి అందించారు రామ్ చరణ్. సినిమా కోసం పని చేసిన కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా సుమారు 35 మందిని ఇంటికి పిలిచి.. వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్, అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం గోల్డ్ కాయిన్ కానుకగా ఇవ్వడమే గాక ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి వారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించి

ram charan gifts gold coin to his team

అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు రామ్ చరణ్ కు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వారి కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరు హీరోల సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు శంకర్ తన కెరీర్లో ప్రతిసారి సెంటిమెంట్ ఒక ప్రయోగం చేస్తూ సక్సెస్ అయ్యాడు. అతను చేసిన ప్రతి హీరోను కూడా విభిన్నమైన షేడ్స్ లో చూపిస్తూ ఉంటారు. ఒక్క పాత్రకు మాత్రమే పరిమితం చేయకుండా వారితోనే డిఫరెంట్ షేడ్స్ చూపించడం శంకర్ కు అలవాటు. మొదటి సినిమా నుంచి కూడా ఆ ప్రయోగం సక్సెస్ అవుతూ వస్తోంది. అలాగే రామ్ చరణ్ తో కూడా రెండు భిన్నమైన షేడ్స్ లో చూపించనున్నట్లు సమాచారం.

Share

Recent Posts

Indian Army : భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఇండియ‌న్ ఆర్మీ..!

Indian Army : ప్ర‌స్తుతం భార‌త్- పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఓ రేంజ్‌లో న‌డుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు…

7 hours ago

Sachin Yadavrao Vananje : దేశం కోసం ప్రాణాలు విడిచిన మరో సైనికుడు..!

Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు…

8 hours ago

Vijayashanti : యుద్ధ సమయంలో ఈ రాజకీయాలేంటి విజయశాంతి ..?

Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్‌లోని స్థావరాలను…

9 hours ago

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…

10 hours ago

IPL 2025 : యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌.. తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే..!

IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…

11 hours ago

G7 Countries : జీ7 దేశాల మద్దతు కూడా భారత్ కే..ఇక పాక్ పని పూర్తిగా అయిపోయినట్లే

G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…

12 hours ago

Anasuya : అన‌సూయ‌.. ఏంటి మ‌రీ ఈ అరాచకం.. కుర్రాళ్లు ఏమై పోవాలి..!

Anasuya : యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టిన అన‌సూయ ఇప్పుడు న‌టిగాను స‌త్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…

13 hours ago

India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

India Pakistan : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్‌…

14 hours ago