Ram Charan : ఇంటికి పిలిచి మ‌రి బంగారు కాయిన్స్ బ‌హుమ‌తిగా ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : ఇంటికి పిలిచి మ‌రి బంగారు కాయిన్స్ బ‌హుమ‌తిగా ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

 Authored By sandeep | The Telugu News | Updated on :3 April 2022,9:00 pm

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంచి సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ఆయ‌న సినిమాలు దాదాపు స‌క్సెస్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి.. రాజమౌళి దర్శకత్వంలో చేసినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న తన 15వ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నాడు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన ఆర్ఆర్ఆర్ చిత్రం తొమ్మిది రోజుల్లోనే 800 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది .ఇంత భారీ విజ‌యం సాధించిన ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న

రామ్ చరణ్ తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్‌ని ఇంటికి పిలిచి మరీ బహుమతులు ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.ఈ సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ రోజు (ఆదివారం) ఉదయం అల్పాహారం కోసం పిలిచి వారందరికీ ఊహించని బహుమతి అందించారు రామ్ చరణ్. సినిమా కోసం పని చేసిన కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా సుమారు 35 మందిని ఇంటికి పిలిచి.. వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్, అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం గోల్డ్ కాయిన్ కానుకగా ఇవ్వడమే గాక ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి వారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించి

ram charan gifts gold coin to his team

ram charan gifts gold coin to his team

అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు రామ్ చరణ్ కు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వారి కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరు హీరోల సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు శంకర్ తన కెరీర్లో ప్రతిసారి సెంటిమెంట్ ఒక ప్రయోగం చేస్తూ సక్సెస్ అయ్యాడు. అతను చేసిన ప్రతి హీరోను కూడా విభిన్నమైన షేడ్స్ లో చూపిస్తూ ఉంటారు. ఒక్క పాత్రకు మాత్రమే పరిమితం చేయకుండా వారితోనే డిఫరెంట్ షేడ్స్ చూపించడం శంకర్ కు అలవాటు. మొదటి సినిమా నుంచి కూడా ఆ ప్రయోగం సక్సెస్ అవుతూ వస్తోంది. అలాగే రామ్ చరణ్ తో కూడా రెండు భిన్నమైన షేడ్స్ లో చూపించనున్నట్లు సమాచారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది