Home » Entertainment » Ram Charan In Vijay Lio Movie
Entertainment

దీ తెలుగు న్యూస్ ఫ్యాక్ట్ చెక్ : విజయ్ లియో సినిమా లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ ??

Authored By
aruna
The Telugu News | Updated on: July 5, 2023 9:27 pm
Advertisement

ఇటీవల తమిళ స్టార్ విజయ్ దళపతి ‘ వారసుడు ‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ లియో ‘ సినిమా లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్న పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. అయితే ఈ వార్తపై సినిమా టీం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సోషల్ మీడియా లో దీనిపై వార్తలు వస్తున్నా వాళ్లు ఏమాత్రం ఖండించడం లేదు. ఇది నిజమా కాదా అని ప్రేక్షకులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

అయితే విక్రమ్ సినిమా ప్రమోషన్ సమయంలో లోకేష్ కనగరాజ్ తన తర్వాత సినిమా రామ్ చరణ్ తో ఉండబోతుందని చెప్పాడు. అంతేకాకుండా ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మరో స్క్రిప్ట్ రాస్తున్నానని చెప్పాడు. కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే రోలెక్స్ల ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు చేయటానికి పెద్ద సెటప్ రెడీ చేసుకున్నాడు. అలాంటప్పుడు తెలుగు హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. విక్రమ్ సినిమా క్లైమాక్స్లో సూర్య క్యారెక్టర్ ఎలా హైలెట్ అయిందో లియో సినిమాను కూడా అలానే రెడీ చేస్తున్నారట.

Ram Charan in Vijay Lio movie

Advertisement

అయితే చెన్నై మీడియా సమాచార ప్రకారం తన సినిమాలో కొద్ది నిమిషాలే అయినా ఇంకో హీరో డామినేషన్ విజయ్ ఒప్పుకునే ఛాన్స్ లేదని ఎవరిని తన సినిమాలో చేయనివ్వడని అంటున్నారు. ఇక రాంచరణ్ ఆమధ్య సల్మాన్ ఖాన్ తో కీసీ కా భాయ్ కిసీకి జాన్ సినిమాలో ఓ పాటకు డాన్స్ చేశాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అందరూ అది మర్చిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాంచరణ్ నటించే అవకాశం ఉండదని తెలుస్తుంది. మరీ లియో సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి