
ram charan missed the great opportunity
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ ఆనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకొని ఆ తర్వాత ఆచార్య సినిమాతో కాస్త డీలా పడ్డారు. ప్రస్తుతం బడా దర్శకులు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. అయితే రామ్ చరణ్ పర్సనల్ విషయానికి వస్తే పదేళ్ల క్రితం ఉపాసనని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇటీవల యానివర్సరీ కూడా జరుపుకున్నారు. అయితే పదేళ్లు అయిన వీరికి పిల్లలు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అపోలో చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పలు సామజిక అంశాలపై రియాక్ట్ అవుతూ ఉండటం, నలుగురికి సాయపడే పనులు చేస్తుండటం ఉపాసన నైజం. అలా ఈ మెగా కోడలికి ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. . రామ్ చరణ్‌తో మూడు ముళ్ల బంధంలోకి ఎంటరై పదేళ్లు గడిచినా ఇంకా పిల్లల్ని ఎందుకు కనడం లేదు అనే అంశంపై నిత్యం ఏదోఒక రకమైన చర్చ నడుస్తూనే ఉంది. 2012 జూన్ 14న ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో రామ్ చరణ్, ఉపాసనల వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు.
ram charan missed the great opportunity
రామ్ చరణ్ పెళ్లి విషయానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రామ్ చరణ్ పెళ్లిని మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితతో చేయాలనకున్నారట . కానీ చరణ్ మాత్రం అప్పటికే తాను ఉపాసనతో ప్రేమలో ఉన్న కారణంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదట. ఉపాసనతో ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పడంతో వెంకటేష్ పిల్లల ఆనందం కన్న మరేది గొప్పది కాదంటూ తన డెసిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అలా వెంకటేష్ కూతురు ఆశ్రిత మెగా కోడలయ్యే ఛాన్స్ పోయింది. ఇక ఆ తర్వాత చిరు.. రామ్ చరణ్, ఉపాసనల వెళ్లిని గ్రాండ్‌గా కళ్లు చెదిరిలా చేయించాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.