Ram Charan son to be born on pawan kalyan birthday
Pawan Kalyan – Ram Charan : ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు. ఏకంగా 10 సంవత్సరాల నుంచి అటు మెగా ఫ్యామిలీ.. ఇటు మెగా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ ఇంట్లోకి వారసుడు వస్తాడా? అని. చివరకు అది రామ్ చరణ్ పెళ్లి అయిన పదేళ్ల తర్వాత సాధ్యం అవుతోంది. నేను తాతను కాబోతున్నానని.. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని మెగాస్టార్ చిరంజీవే తన ట్విట్టర్ ఖాతాలో మెగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానుల్లో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని
తన అభిమానులతో పంచుకున్నారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇదే చర్చ. నిజానికి 2022 సంవత్సరం రామ్ చరణ్ కు చాలా అచ్చొచ్చింది. ఎందుకంటే.. 2022 లోనే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైంది. ఆ సినిమా రామ్ చరణ్ కు ఎంత పేరు తీసుకొచ్చిందో తెలుసు కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈనేపథ్యంలో మరో గుడ్ న్యూస్ ఆయన్ను మరింత ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేసింది. అయితే.. ఈ నెలలోనే ఉపాసన గర్భం దాల్చిందని తెలియడంతో సరిగ్గా 9 నెలల తర్వాత అంటే వచ్చే సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఆమె డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే ఉన్న విషయం తెలిసిందే.
Ram Charan son to be born on pawan kalyan birthday
లేదంటే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉంది. అంటే ఇప్పటి నుంచి కౌంట్ చేస్తే వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా ఉపాసన డెలివరీ అయ్యే అవకాశం ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇద్దరు తాతల్లో ఎవరో ఒకరి పుట్టిన రోజు నాడు రామ్ చరణ్ బిడ్డ జన్మించే అవకాశం ఉందని ఇప్పటి నుంచే మెగా అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. మెగాస్టార్ కానీ.. పవర్ స్టార్ కానీ వీళ్ల పుట్టిన రోజులలో ఎవరి పుట్టిన రోజున రామ్ చరణ్ బిడ్డ జన్మించినా అంతకంటే సంతోషం ఇంకేం ఉంటుంది అని మెగా ఫ్యామిలీ కూడా సంబురపడిపోతుందట. చూద్దాం మరి.. రామ్ చరణ్ బిడ్డ ఎవరి పుట్టిన రోజున జన్మిస్తారో?
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.