Ram Charan – Trivikram : క్రేజీ న్యూస్.. త్వరలో రామ్ చరణ్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ .. రిలీజ్ ఎప్పుడంటే..!
ప్రధానాంశాలు:
Ram Charan - Trivikram : క్రేజీ న్యూస్.. త్వరలో రామ్ చరణ్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ .. రిలీజ్ ఎప్పుడంటే..!
Ram Charan – Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ భారీ సోషియో ఫాంటసీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే బన్నీ.. అట్లీతో కమిట్ అయ్యే సరికి త్రివిక్రమ్ ఆ టైమ్‌ని కాస్త వెంకటేష్‌తో ప్రాజెక్ట్ చేయడానికి వినియోగించుకోబోతున్నాడు. త్రివిక్రమ్ మార్కు ఎంటర్‌టైనర్‌గా తెరపైకి రానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కాబోతోంది.

Ram Charan – Trivikram : క్రేజీ న్యూస్.. త్వరలో రామ్ చరణ్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ .. రిలీజ్ ఎప్పుడంటే..!
Ram Charan – Trivikram : క్రేజీ ప్రాజెక్ట్
ఇది వెంకీ సోలో ఫిల్మ్ కాదని దీన్ని భారీ మల్టీస్టారర్‌గా త్రివిక్రమ్ చేయబోతున్నారని తెలిసింది. అంతే కాకుండా ఇందులో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గత కొంత కాలంగా రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయాలని త్రివిక్రమ్ భావించారు కానీ అది ఇంత వరకు మెటీరిలైజ్ కాలేదు. దీంతో వెంకీ ప్రాజెక్ట్‌లోకి చరణ్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
గత కొంత కాలంగా చరణ్‌తో సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకున్నాడు కానీ అది ఇప్పటికి కుదరలేదు. త్రివిక్రమ్ చెప్పే కథ చరణ్‌కు నచ్చితేనే ఇది మెటీరియలైజ్ అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబో 2026 మధ్యలో, వెంకటేష్ సినిమా తర్వాత ప్రారంభం కానుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కొత్త నిర్మాణ సంస్థ నిర్మించనుంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.