Ram Charan : పని వాళ్లు కాదు ఫ్యామిలీ మెంబర్స్.. క్రిస్మస్ రోజు రామ్ చరణ్ ఉపాసన చేసిన పనికి అందరు షాక్..!
ప్రధానాంశాలు:
Ram Charan : పని వాళ్లు కాదు ఫ్యామిలీ మెంబర్స్.. క్రిస్మస్ రోజు చరణ్ ఉపాసన చేసిన పనికి అందరు షాక్..!
Ram Charan : తమ దగ్గర పనిచేసే పని వాళ్లను ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేస్తారు. కొందరేమో వాళ్లని కేవలం పని వాళ్లలానే చూస్తూ వాళ్లపై అధికారం చెలాయిస్తూ ఉంటారు. కొందరు మాత్రం వారు పని వాళ్లు కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అనేలా ట్రీట్ చేస్తారు. పని వాళ్లతో అలా క్లోజ్ గా ఉన్న సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మెగా ఫ్యామిలా ఒకటి. రామ్ చరణ్ ఉపాసన తమ పని వాళ్లతో కలిసి క్రిస్ మస్ వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చరణ్ తానొక స్టార్ హీరో అన్న బిల్డప్ ఏమి కాకుండా ఎంతో క్లోజ్ గా అతని పని వాళ్లతో కూర్చుని ఉన్నాడు. తన ఇంట్లో తన టీం అందరితో కలిసి క్రిస్మస్ వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు చరణ్, ఉపాసన. అందరు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు.
Ram Charan పని వాళ్లే కదా అని ట్రీట్ చేయకుండా..
ఈ ఫోటో చూసి చరణ్, ఉపాసన వాళ్ల దగ్గర పని చేస్తున్న పని వాళ్లని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుస్తుందని అంటున్నారు. కేవలం పని వాళ్లే కదా అని ట్రీట్ చేయకుండా వారిని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇలా అందరు ఆలోచిస్తే చాలా బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.
చరణ్ మంచి మనసుకి తగినట్టుగానే ఉపాసన కూడా తాను ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి పరురాలు అన్న గర్వం లేకుండా ఎంచక్కా పని వాళ్లతో కలిసి కింద కూర్చుని మరీ క్రిస్ మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నది. ఈ ఫోటో చూసిన వారు చరణ్, ఉపాసన ఇంట్లో చేస్తున్న పని వాళ్లు కూడా అదృష్టవంతులే అనుకుంటున్నారు. త్వరలో చరణ్ గేం ఛేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. సినిమాను శంకర్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. Ram Charan, Upasana, Mega Family, Game Changer