Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ప‌ప్పులు బిగ్ బాస్‌లో ఉడ‌క‌లేదుగా.. త్వ‌ర‌గానే బ‌య‌టికి వ‌చ్చేసింది..!

Authored By Sam C | The Telugu News | Published on: March 15, 2022, 7:40 am

Ram Gopal Varma : బుల్లితెర ఓటీటీ షో మంచి రంజుగా సాగుతుంది. 17 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షోలో కంటెస్టెంట్స్ నానా ర‌చ్చ చేస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన షో ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వారాంతానికి చేరడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాల్సి ఉంది. మొదటి వారం హాట్ బాంబ్ గా పేరుపొందిన ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా రెండో వారం కూడా నామినేషన్ లో 11 మంది సభ్యులు వచ్చారు. రెండో వారంలో సరయు,అఖిల్‌,హమీదా, అనిల్‌, మిత్రా శర్మ, అరియానా, శివ, నటరాజ్‌ మాస్టర్‌, అషూ రెడ్డి, శ్రీరాపాక, మహేశ్‌ విట్టా.. మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

ఈ సారి హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో ఈ ఎలిమినేషన్ సాగింది. రెండో వారంలో బిగ్‌బాస్‌ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు.ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ కొనసాగిస్తున్న శ్రీరాపాక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం మూవీలో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీలో దారుణమైన బోల్డ్ సన్నివేశాల్లో ఆమె హద్దులు లేని స్కిన్ షో చేశారు. నగ్నం మూవీతో శ్రీరాపాక ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు.బిగ్ బాస్ షో ఈ అమ్మ‌డు మ‌రింత ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఉన్న‌న్ని రోజులు హౌజ్‌లో నానా ర‌చ్చ చేసింది. అయితే కొన్ని వివాదాల వ‌ల‌న ఈ అమ్మ‌డు రెండో కంటెస్టెంట్‌గా హౌజ్‌ని వీడాల్సి వ‌చ్చింది. ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన ఈ అమ్మ‌డికి నిరాశే ఎదురైంది.

Ram Gopal Varma Heroine Bigg Boss in Eliminate

Ram Gopal Varma Heroine Bigg Boss in Eliminate

Ram Gopal Varma : పాపం ఇలా బిస్కెట్ అయిందేంటి?

పాత – కొత్త కంటెస్టెంట్ ల కలయిక తో బిగ్ బాస్ నాన్ స్టాప్ సిద్ధం చేయ‌గా, ముందుగా పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ అని కొత్తగా వచ్చిన వారిని ఛాలెంజర్స్ అని పిలుస్తున్నారు. వరుసగా రెండు వారాలు నామినేషన్ లోకి వచ్చిన శ్రీ రాపాక రెండో వారం ఎలిమినేట్ అయింది. శ్రీ రాపాక ఎలిమినేట్ అవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక హౌస్ లో ఉన్న బోల్డ్ బ్యూటీలలో ఒకరు తగ్గారు. మొదటి వారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో కొంచెం కలర్ తగ్గింది. మరి ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉంటారో చూడాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp