Ram Gopal Varma : ఆర్ఆర్ఆర్ వేస్ట్.. రామ్ గోపాల్ వ‌ర్మ‌ మూవీ బెస్ట్ అన్న కేఏ పాల్‌.. షాక్‌లో అభిమానులు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ram Gopal Varma : ఆర్ఆర్ఆర్ వేస్ట్.. రామ్ గోపాల్ వ‌ర్మ‌ మూవీ బెస్ట్ అన్న కేఏ పాల్‌.. షాక్‌లో అభిమానులు

Ram Gopal Varma : ఒక సినిమాని రూపొందించ‌డం గొప్ప విష‌యం కాదు, దానిని ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో తెలిసిన వాడే అస‌లు సిస‌లైన డైరెక్ట‌ర్‌. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఇటీవ‌ల త‌న ఆర్ఆర్ఆర్ సినిమాని ఎలా ప్ర‌మోట్ చేసుకున్నాడో మ‌నం చూశాం. ఈ సినిమా కోసం అనేక ప్రాంతాల‌కు వెళ్లి భారీగా ప్ర‌మోష‌న్స్ చేసుకున్నాడు. ఇక జ‌క్క‌న్న త‌ర్వాత మ‌ళ్లీ అంత‌గా త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకునే స‌త్తా ఉన్న వ్యక్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 April 2022,2:30 pm

Ram Gopal Varma : ఒక సినిమాని రూపొందించ‌డం గొప్ప విష‌యం కాదు, దానిని ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో తెలిసిన వాడే అస‌లు సిస‌లైన డైరెక్ట‌ర్‌. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఇటీవ‌ల త‌న ఆర్ఆర్ఆర్ సినిమాని ఎలా ప్ర‌మోట్ చేసుకున్నాడో మ‌నం చూశాం. ఈ సినిమా కోసం అనేక ప్రాంతాల‌కు వెళ్లి భారీగా ప్ర‌మోష‌న్స్ చేసుకున్నాడు. ఇక జ‌క్క‌న్న త‌ర్వాత మ‌ళ్లీ అంత‌గా త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకునే స‌త్తా ఉన్న వ్యక్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌న తాజా చిత్రం డేంజ‌ర‌స్ మూవీని వెరైటీగా ప్ర‌మోట్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జా శాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కెఏ పాల్‌ని వాడేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.

ఇటీవ‌ల కేఏ పాల్ ఓ వీడియోలో ప్ర‌తీ రోజు ఓ కొత్త సినిమా వ‌స్తుంది. అవ‌న్నింటినీ ఎవ‌రు గుర్తుంచుకుంటారు. ఆర్ఆర్ఆర్ గురించి ఎప్పుడూ విన‌లేదు. అంటూ స‌మాధాన‌మిచ్చాడు. అంతేకాదు మీకు వేరే ప‌నులేమి లేవా..? అని యువ‌త‌ను ప్ర‌శ్నించాడు. మీరు విడుద‌లైన ప్ర‌తీ సినిమాను చూస్తారా..? అని ప్ర‌శ్నించాడు. ఎవ‌రైనా సినిమా తీస్తే..మీరు దాన్ని చూస్తారు. ఇది పూర్తిగా టైం వృథా. మీరు ఆ సినిమా నుంచి ఎలాంటి మంచి విష‌యాన్ని పొంద‌లేరు. క‌నీసం అర్థ‌వంత‌మైన సినిమాలు చూడండి. నేనెప్పుడూ ఆర్ఆర్ఆర్ గురించి విన‌లేదు. అస‌లు అదేంటో నాకు తెలియ‌దు.అంటూ సెటైరిక‌ల్‌గా చెప్పుకొచ్చాడు. దీనికి వ‌ర్మ‌ ‘నీ మొహం రా’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

Ram Gopal Varma promotional video viral

Ram Gopal Varma promotional video viral

Ram Gopal Varma : వ‌ర్మ స్ట్రాట‌జీ మాములుగా లేదు..

ఇప్పుడు అదే వీడియోని త‌న సినిమా ప్ర‌మోష‌న్‌కి వాడుకొని ధన్య‌వాదాలు తెలిపాడు వారు. ఆ వీడియోలో ఆర్జీవీ గారు తీసిన డేంజరస్ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా చూడాలి అని పాల్ చెబుతున్నట్లు ఈ వీడియో రూపొందించారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్స్ చేయడంలో వర్మ రూటే సపరేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.మా ఇష్టం’ అనేది ఒక క్రైమ్ డ్రామా మూవీ అని, అందులో లీడ్ పెయిర్ లెస్బియన్స్ ఉంటారని, ఆ పాత్రల్లో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారని వర్మ అన్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది