Ram Gopal Varma : ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో తిట్టేసిన రామ్ గోపాల్ వర్మ.. ఎందుకంత కోపం వ‌చ్చింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Gopal Varma : ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో తిట్టేసిన రామ్ గోపాల్ వర్మ.. ఎందుకంత కోపం వ‌చ్చింది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 October 2022,1:30 pm

Ram Gopal Varma : అక్టోబ‌ర్ 23వ తేది అభిమానుల‌కి పండగే. ప్రభాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. . తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఆఖరికి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లోనూ ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా కనిపించింది. అయితే అభిమానం ఎంతైనా ఉండొచ్చు పరవాలేదు. కానీ అభిమానుల హంగామా లైన్ క్రాస్ చేసి.. రచ్చ చేస్తే.. ఇబ్బందులు తప్పవు. చాలా సార్లు ఆ హ‌ద్దులు దాటే అభిమానంతో సంబంధం లేని వారి సైతం ఇబ్బందులు పడుతున్నారు.

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల మూసేసిన వెంకట్రామ థియేటర్‌లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అందులో బిల్లా స్పెషల్ షో వేయించారు. ఈ షోకి ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరు అయ్యారు. అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. సినిమా చూస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్‌లో బాణసంచా పేల్చారు. ఈ సందర్భంగా అనుకోకుండా సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో థియేటర్ మొత్తం మంటలు అంటుకున్నాయి. వెంటనే తేరుకున్న ప్రభాస్ అభిమానులు మరియు థియేటర్ యాజమాన్యం ఆ మంటలను ఆర్పేశారు. మొత్తానికి ప్రభాస్ పుట్టనరోజు నాడు పెద్ద ప్రమాదం తప్పింది.

Ram Gopal Varma satires on prabhas fans

Ram Gopal Varma satires on prabhas fans

Ram Gopal Varma : సెటైర్ వేశాడుగా..

అయితే, సినిమాని షో మధ్యలో ఆపినందుకే కొందరు ఫ్యాన్స్ మంటలు పెట్టారని టాక్ నడుస్తోంది. థియేటర్ లో ప్రభాస్‌ అభిమానులు దీపావళి సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ చర్యని ఖండించారు. ఇది దీపావళి వేడుక కాదు. తన సినిమా తెరపై నడుస్తుండగా, థియేటర్‌ని తగలబెట్టి సంబరాలు చేసుకోవడం ప్రభాస్‌ అభిమానుల పిచ్చ చర్య అంటూ పోస్ట్ పెట్టారు. అ తర్వాత ఇది ప్రభాస్‌ స్టయిల్‌ ఆఫ్‌ దీపావళి సెలబ్రేషన్‌ అంటూ మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి. దీనిపై రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గ‌తంలో కూడా ప‌లువురు హీరోల అభిమానులు ఇలాంటి రచ్చ చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది