Ram Gopal Varma : రాజమౌళిపై రామ్ గోపాల్ వర్మ నిందలు.. టాలీవుడ్‌ని జక్కన్నే నాశనం చేసాడంటూ ఫైర్!
Ram Gopal Varma : ఇటీవల టాలీవుడ్ పరిస్థితి దారుణంగా మారింది. వరుస సినిమాలు ఫ్లాపులు అవుతుండడం, థియేటర్స్‌కి జనాలు రావడం చాలా కష్టంగా మారడం, ఇదే సమయంలో నిర్మాతలు బంద్‌కి పిలుపు ఇవ్వడం అంతా గందరగోళం అయింది. టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు పోటీగా ఓ సంఘాన్ని స్టార్ట్ చేసారు నిర్మాత దిల్ రాజు. రెండు డజన్లకు పైగా సభ్యులతో బాగానే సాగుతోంది ఆ సంఘం. అయితే ఇప్పుడు ఏకంగా నిర్మాణాల బంద్ కు పిలుపు ఇవ్వడం అన్నది వివాదాస్పదంగా మారుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కోంటున్న థియేటర్స్ సమస్యలు, ఓటిటి ప్రభావం, నిర్మాతల సమస్యలపై రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
Ram Gopal Varma : వర్మ కామెంట్స్ వైరల్
థియేటర్స్ కి జనాలు రాకపోవడం.. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడంపై టాలీవుడ్ లో ఎవరి లెక్కలు వాళ్ళకి ఉన్నాయి. ఓటిటి ప్రభావం పడిందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని అంటున్నారు. టాలీవడ్ లో ఈ పరిస్థితికి కారణం ఓటిటి, థియేటర్స్ సమస్య ఇవేమి కాదు. ఈ పరిస్థితి అంతటికి కారణం రాజమౌళి ఒక్కడే. అతడి వల్లే ఇందంతా.. టాలీవుడ్ కి రాజమౌళి శత్రువు అంటూ రాంగోపాల్ వర్మ నిందలు వేసారు. తనదైన స్టైల్‌లో పలు కారణాలు కూడా చెప్పాడు. రాజమౌళి మంచి సినిమాకి రెండు వేల కోట్లు వస్తాయని నిరూపించారు. ఇప్పుడు ఆ రేంజ్‌లో నిరూపించుకోవడానికి మిగతా వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నారు.
రాజమౌళి స్టాండర్డ్స్ అందుకునేందుకు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఫలితంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. నిర్మాత అంత డబ్బు పెట్టలేను అని చెప్పినా దర్శకులు ఒప్పుకోవడం లేదు. రాజమౌళి తర్వాత మరో సమస్య యూట్యూబ్, సోషల్ మీడియా అని వర్మ అన్నారు. థియేటర్ కంటే మంచి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్, సోషల్ మీడియాలో లభిస్తోంది. ఇక 2 గంటలు టైం వేస్ట్ చేసుకుని థియేటర్స్ కి ఎవరు వెళతారు అని వర్మ ప్రశ్నించారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.