హీరో రామ్‌ను తీసుకొచ్చి చెక్ పెట్టేశారు.. వాటిని ఢీ కొట్టే భారీ ప్లాన్.. వీడియో

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 5, 2021, 12:04 pm

బుల్లితెరపై పండుగ వాతావరణం సందడి సండిగా మారుతంది. ఈ మధ్య పండుగలు బయట కంటే బుల్లితెరపైనే ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతీ పండుగకు స్పెషల్ ఈవెంట్లు చేస్తుండటం, ఒకరిపై మరోకరు పైచేయి సాధించాలన్న కసితో కొత్త కొత్త ప్రోగ్రాంలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి చానెళ్ల మధ్య కనబడని కోల్డ్ వార్ ఒకటి జరుగుతోంది. ప్రతీ పండుగకు వీటి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది.

Ram Pothineni In Zee Telugu Sankranthi Sambaralu 2021

Ram Pothineni In Zee Telugu Sankranthi Sambaralu 2021

అలా దసరా, దీపావళి ఈవెంట్లు మాత్రం ఓ రేంజ్‌లో జరిగింది. ఈవెంట్ల మీద ఈవెంట్లు, వాటికి సంబంధించిన ప్రోమోలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. మొత్తానికి జీ తెలుగులో బుట్టబొమ్మగా నిహారికను పట్టుకొచ్చారు.. ఆ తరువాత ప్రదీప్ శ్రీముఖి మధ్య ఏదో ఉందన్నట్టుగా మరో ఈవెంట్ చేశారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం మరింత కొత్తగా ప్లాన్ చేసినట్టున్నారు. ఈపాటికే ఈటీవీ, స్టార్ మాలు ప్రోమోలతో దంచి కొడుతున్నారు.

ఈ టీవీలో అత్తో అత్తమ్మ కూతురో, స్టార్ మాలో ఇట్సే ఫ్యామిలీ ప్టారీ అంటూ ఈవెంట్లు రెడీ చేశారు. వాటికి సంబంధించిన ప్రోమోలు కూడా వచ్చేశాయి. అయితే వీటికి ధీటుగా నిలబడేందుకు జీ తెలుగు వాళ్లు ఎనర్జిటిక్ రామ్‌ను దించారు. బైక్ ర్యాలీలతో రచ్చచేయించారు. జీ తెలుగు సంక్రాంతి సంబరాలు ఈవెంట్‌లో రామ్ చేత రఫ్పాడించారు. మరి రామ్ రాకతో ఈ ఈవెంట్ మిగతా వాటిని ఢీ కొట్టగలదా? లేదా? అన్నది చూడాలి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp