Ram Prasad : ఒక్క స్కిట్‌కి రామ్ ప్ర‌సాద్ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడా?

Authored By Sam C | The Telugu News | Published on: September 14, 2022, 5:30 pm

Ram Prasad : బుల్లితెర పాపులారిటీ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుండ‌గా, ఈ షో వ‌ల‌న ఎంత మంది పాపులారిటీ అంది పుచ్చుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన వారిలో రామ్ ప్ర‌సాద్ కూడా ఒక‌రు. ఒక‌ప్పుడు సుడిగాలి సుధీర్ టీంలో సైడ్‌కి ఉండే రామ్ ప్ర‌సాద్ ఇప్పుడు మాత్రం మెయిన్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఎంత పాపులారిటీ వచ్చినా సరే జబర్దస్త్ ను మాత్రం విడిచి వెళ్ళకుండా ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంచితే జ‌బ‌ర్ధ‌స్త్ ఆర్టిస్ట్‌ల రెమ్యునరేషన్ గురించి కొన్ని వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సుడిగాలి సుదీర్ భారీగానే తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Ram Prasad : బాగానే సంపాదిస్తున్నాడుగా..!

ఇక అతని టీంలో ఉండే గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ సంపాదనపై కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. వీరిద్దరూ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రాంప్రసాద్ ఒక్క స్కిట్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అనే విషయం పై జనాలు చర్చించుకుంటున్నారు. రాంప్రసాద్.. సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం రాంప్రసాద్ ఒక్క స్కిట్ కి రూ. 1,50,000 తీసుకుంటున్నట్లు సమాచారం. అతి కొద్ది స‌మ‌యంలోనే ఇంత పాపులారిటీ తెచ్చుకున్న రామ్ ప్ర‌సాద్ డ‌బ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాడ‌ని అంటున్నారు.

Ram Prasad remuneration For One Skit In Extra Jabardasth

Ram Prasad remuneration For One Skit In Extra Jabardasth

రామ్ ప్రసాద్ కేవలం నటన మాత్రమే కాకుండా స్క్రిప్ట్ కూడా రాస్తున్నాడు. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ షో గురించి చాలామంది పాజిటివ్ గా చెప్పిన వాళ్లే ఉన్నారు. కాని ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో గురించి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. షోలో టీం లీడర్స్ ని ఒకలాగా కంటెస్టెంట్ ని ఒకలాగా చూస్తారని ఫూడ్ కూడా సరిగా పెట్టరని.. రెమ్యూనరేషన్ విషయంలో అన్యాయంగా బిహేవ్ చేస్తారని ..చాలా కామెంట్స్ వినిపించాయి. ముందుగా కిరాక్ ఆర్పీ చిచ్చు పెట్ట‌గా, ఆ త‌ర్వాత మిగ‌తా వాళ్లు కూడా త‌మ స్పంద‌న తెలియ‌జేశారు. షోఫై వారి వారి సమాధానాలు చెప్పారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp