Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా బ్రేకప్ అయ్యారా? అసలు విషయం ఏంటీ?
Sudigali Sudheer : జబర్దస్త్ ప్రారంభం అయిన కొన్నాళ్లకు సుడిగాలి సుధీర్ టీమ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి సుడిగాలి సుదీర్ తో పాటు గెటప్ శ్రీను మరియు రాంప్రసాద్ ఒక్క టీం గా కొనసాగుతున్నారు. వీరితో పాటు సన్నీ కూడా టీంలో ఉన్నాడు. చాలా సంవత్సరాల పాటు వీరు టీం గా కొనసాగి జబర్దస్త్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను వేరే టీమ్స్ గా విడిపోయే అవకాశం వచ్చినా కూడా విడిపోకుండా సుడిగాలి సుదీర్ తో కొనసాగారు. అత్యధిక రెమ్యూనరేషన్ సుడిగాలి సుదీర్ టీం కి ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు కూడా జబర్దస్త్ కి ఒక అద్భుత వరం అంటూ ప్రేక్షకులు అంతా భావించేవారు.
అలాంటి జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ వెళ్లి పోవడంతో టీం అంతా ఇప్పుడు ముక్కలు చెక్కలు అయింది అన్నట్లుగా పరిస్థితి ఉంది. సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడు, ప్రస్తుతం రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను టీం గా జబర్దస్త్ లో కొనసాగుతున్నారు. జబర్దస్త్ లో వీళ్ళు కనిపించడం లేదు. కానీ బయట వీళ్ళు స్నేహితులుగా కంటిన్యూ అవుతున్నారని అంతా అనుకుంటున్నారా. కానీ వీళ్లు బయట కూడా విడి పోయారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వీరి స్నేహం గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సుడిగాలి సుదీర్ పూర్తిగా జబర్దస్త్ టీం తో కలవడం లేదని.. ముఖ్యంగా గెటప్ శ్రీను మరియు రాంప్రసాద్ లకు సాతమైనంత దూరం ఉంటున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Sudigali Sudheer getup srinu and ram prasad friendship breakup
అందుకు కారణం ఏంటి అనే విషయమై క్లారిటీ రావడం లేదు.. కానీ సుడిగాలి సుదీర్ ని గెటప్ శ్రీను మరియు రాంప్రసాద్ కూడా దూరం పెడుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటీవీ జబర్దస్త్ లోకి సుడిగాలి సుదీర్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని.. అందుకోసం రోజా మంతనాలు జరుపుతున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ లో ఈటీవీలో మళ్లీ సుడిగాలి సుదీర్ ఎంట్రీ అనేది సాధ్యం కాదని తేలిపోయింది. పైగా గెటప్ శ్రీను మరియు రాంప్రసాద్ లతో సుడిగాలి సుధీర్ కి గొడవలు కూడా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటో తెలియాలంటే వారి ముగ్గురిలో ఎవరో ఒకరు నోరు విప్పాలి.