Ram Prasad – Getup Srinu : రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను… ఇద్దరిలో ఎవరికి పారితోషికం ఎక్కువ తెలుసా?
Ram Prasad – Getup Srinu : జబర్దస్త్ లో కీలక వ్యక్తులు రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీను. వీరిద్దరు మొన్నటి వరకు సుడిగాలి సుధీర్ టీమ్ లో ఉండేవారు. సొంతంగా టీమ్ పెట్టుకునే అవకాశం ఉన్నా.. పలు సార్లు ఆ ఛాన్స్ వచ్చినా కూడా రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీను లు సుధీర్ తో స్నేహం కారణంగా అదే టీమ్ లో కొనసాగిన విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల సుడిగాలి సుధీర్ ఈటీవీ నుండి వెళ్లి పోయాడు. జబర్దస్త్ లో ఆయన ప్రస్థానం ముగిసింది. దాంతో ఇప్పుడు రామ్ ప్రసాద్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. రామ్ ప్రసాద్ తో పాటు గెటప్ శ్రీను కూడా టీమ్ లో ఉన్నాడు.
రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీనుల్లో ఎవరికి ఎక్కువ పారితోషికం ఉంటుంది అంటూ ఆసక్తిగా చర్చ జరుపుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఈటీవీ మరియు మల్లె మాల వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ ప్రసాద్ రైటింగ్ లో కూడా ఉంటాడు. ఆయనే స్వయంగా స్కిట్ లు రాస్తాడు. గంట రెండు గంటల్లో స్కిట్ లు ఇచ్చేస్తాడు. తన టీమ్ కు మాత్రమే కాకుండా ఇతర టీమ్స్ కి కూడా ఆయన స్క్రిప్ట్ ఇస్తాడు. కనుక ఆయన పారితోషికం చాలా ఎక్కువ అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గెటప్ శ్రీను కి ఒక కాల్షీట్ కి లక్ష రూపాయల పారితోషికం అందిస్తారు. ఇక రామ్ ప్రసాద్ కి ఆయన నటన మరియు స్క్రిప్ట్ వర్క్ కి గాను ఒక్క కాల్షీట్ కి గాను లక్షన్నర రూపాయల పారితోషికంను అందుకుంటాడట. ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్స్ లో ఆది తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కమెడియన్ గా రామ్ ప్రసాద్ నిలిచాడు. ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా భారీ మొత్తంలో పారితోషికం ను తీసుకుంటాడని సమాచారం. అయితే సినిమాల్లో నటించడం ద్వారా గెటప్ శ్రీను భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు అనేది టాక్.