Janaki Kalaganaledu : జానకి ఐపీఎస్ చదువు విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా? ఈసారి జ్ఞానాంబ కఠిన నిర్ణయం? అది రామాకు తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu : జానకి ఐపీఎస్ చదువు విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా? ఈసారి జ్ఞానాంబ కఠిన నిర్ణయం? అది రామాకు తెలుస్తుందా?

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ సోమవారం ఎపిసోడ్ 25 ఏప్రిల్ 2022, ఎపిసోడ్ 286 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముగ్గు విషయంలో జానకి, మల్లిక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి ఆగు మల్లిక అంటుంది. నీకు బుద్ధి ఉందా. జానకితో పనులు చేయిస్తావా. ఇక నుంచి జానకితో ఏ పని […]

 Authored By gatla | The Telugu News | Updated on :24 April 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ సోమవారం ఎపిసోడ్ 25 ఏప్రిల్ 2022, ఎపిసోడ్ 286 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముగ్గు విషయంలో జానకి, మల్లిక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి ఆగు మల్లిక అంటుంది. నీకు బుద్ధి ఉందా. జానకితో పనులు చేయిస్తావా. ఇక నుంచి జానకితో ఏ పని చేయించకూడదు అంటుంది జ్ఞానాంబ. ఇక నుంచి జానకితో ఏ పని చేయించినా నీకు మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని వంట పని, ఇంటి పని అన్నీ నువ్వే చేయాలి అంటుంది జ్ఞానాంబ. దీంతో మీరు ఒక్కరోజులోనే పూర్తిగా మారిపోయారు అంటుంది మల్లిక.

ramachandra feels tension about janaki studies in janaki kalaganaledu

ramachandra feels tension about janaki studies in janaki kalaganaledu

అవును.. నా పెద్ద కోడలును నెత్తిన పెట్టుకుంటున్నాను అంటుంది జ్ఞానాంబ. ఇన్నాళ్లు నా గొప్పదనాన్ని తెలుసుకోలేక తనతో పనులు చేయించాను. తెలిశాక కూడా ఎలా చేయిస్తాను అంటుంది జ్ఞానాంబ. మల్లిక అక్కడి నుంచి వెళ్లిపోయాక.. నువ్వు నా ఇంట్లో ఒక్క పని కూడా చేయడానికి వీలులేదు. నువ్వు ఈ ఇంట్లో ఒక వస్తువు మాత్రమే. నా ఇంటి విషయాల్లో నీకు జోక్యం చేసుకునే అవసరం లేదు… అంటుంది. ఇంతలో రామా వస్తాడు. మీతో కొన్ని రోజుల పాటు ఏ చిన్న పని కూడా చేయించకూడదని అమ్మ నిర్ణయం తీసుకుందని చెబుతాడు రామా.

మా అమ్మ చూశారా.. ఎంత గొప్పగా ఆలోచించారో. మా అమ్మ చాలా గొప్పది అంటాడు రామా. అమ్మ చెప్పినట్టు వినండి అని చెప్పి కొట్టుకు వెళ్తాడు రామా. మరోవైపు యోగి.. జానకి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. జానకి ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అని అనుకుంటాడు.

ఇంతలో ఊర్మిల వచ్చి.. మనం జానకి వాళ్ల ఇంటికి వెళ్లాలి అంటుంది. దీంతో జానకి వాళ్ల ఇంటికా ఎందుకు అంటాడు యోగి. యోగికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ల ఇంటికి వెళ్లను అంటాడు. కానీ.. బారసాలకు పిలవడానికి వెళ్లాల్సిందే అంటుంది ఊర్మిల.

అయినా కూడా వద్దు.. వాళ్లను పిలవను అంటాడు. కానీ.. వాళ్లు వద్దు అనుకుంటే వదిలేసుకునే బంధం కాదు మనది. వాళ్లతో ఎప్పటికైనా బంధాన్ని కలుపుకోవాల్సిందే. ఎలాగైనా మనం రేపు జానకి ఇంటికి వెళ్లి కుటుంబ సమేతంగా బారసాలకు పిలుద్దాం అని యోగిని నచ్చజెబుతుంది.

మరోవైపు అభి.. జానకికి ఫోన్ చేస్తాడు. నైట్ క్లాస్ లకు రావడం లేదని అడుగుతాడు. ఆ తర్వాత లక్ష రూపాయల ఫీజు కట్టాలని చెబుతాడు. దీంతో ఆ ఫీజు ఎలా కట్టాలో జానకికి అర్థం కాదు. ఇంతలో రామా రావడంతో తనకు ఈ విషయం చెబుతుంది.

Janaki Kalaganaledu : ఐపీఎస్ చదువు మానేస్తానన్న జానకి

ఫీజు కట్టేద్దాం. టెన్షన్ ఏం లేదు అంటాడు రామా. కానీ.. జానకి మాత్రం వద్దు.. ఐపీఎస్ చదువు మానేస్తానని జానకి అంటుంది. దీంతో రామా మాత్రం.. భార్య కలను నిజం చేయడం కోసం నేను ఏదైనా చేస్తాను అంటాడు రామా. అమ్మకు మీ చదువు విషంయ తెలిసినా కూడా ఏం కాదు. మీరేం టెన్షన్ పడకండి అంటాడు రామా.

కట్ చేస్తే ఓ పెళ్లి కోసం పంపించిన స్వీట్ల ఆర్డర్ డబ్బులు 3 లక్షలు వస్తాయి. వాటిని తీసుకెళ్లి జ్ఞానాంబకు ఇస్తాడు రామా. వీటిలో ఒక లక్ష రూపాయలు అమ్మను అడిగి జానకి ఫీజు కడుతా అని అనుకుంటాడు రామా. వెళ్లి జ్ఞానాంబకు 3 లక్షల గురించి చెబుతాడు.

అయితే.. టౌన్ లో మరో కొట్టు పెడదామని.. దాని కోసం ఒక కొత్త షాపును చూడమని రామాకు చెబుతుంది జ్ఞానాంబ. ఆ డబ్బును అడ్వాన్స్ గా ఇవ్వమని చెబుతుంది. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. తన ఫీజు కట్టడం కోసం ఆ మూడు లక్షల్లో ఒక లక్ష తీసుకొని జానకి ఫీజు కడుతాడా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది