Rambha : రంభ కాపురాన్ని నిలబెట్టిన టాలీవుడ్ డైరెక్టర్.. లేదంటే ఏమై ఉండేదో..!
Rambha : ఒకప్పుడు అందంతో ఫేమస్ అయిన రంభ ఇప్పుడు సినిమాలకు దూరమైనా అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు టీవీ షోలో రంభ హల్ చల్ చేసింది తొలిముద్దు సినిమాలో రంభ చేసిన కొన్ని సన్నివేశాలే స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణకి నచ్చాయి. దాంతో ఆయన నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ రకంగా రంభ హీరోయిన్‌గా మొదటి సినిమా ఆ ఒక్కటీ అడక్కు అయింది. ఆ తర్వాత సరిగమలు, చిన్నల్లుడు వంటి సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలలో రంభ చేసింది సాంప్రదాయం కలిగిన పాత్రలు. రంభ ఎనిమిది ప్రాంతీయ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించింది.
రంభ ప్రధానంగా తెలుగు మరియు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీతో పాటు కొన్ని బెంగాలీ ,భోజ్‌పురి సినిమాలలో నటించింది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది… రంభకి సపోర్ట్‌గా.. రంభ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఆమె ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత తరం హీరోల సినిమాల్లోనూ ఆమె నటించింది. ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ నటించిన సినిమాలలో వారితో కలిసి ఐటెం సాంగ్స్ చేసి కూడా హీటెక్కించింది రంభ. ఆ తర్వాత రంభ భోజ్‌ఫురి భాషలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులకు ఆరాధ్య దేవత అయిపోయింది. భోజ్‌పురి హీరోలు రవికిషన్‌సింగ్, మనోజ్ తివారితో కలిసి రంభ అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తర్వాత ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయ్యింది.
రంభ – ఇంద్ర కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే ఆ మధ్య ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. రంభ తన భర్త ఇంద్ర కుమార్‌కు విడాకులు ఇచ్చేస్తానని పంతానికి పోయింది. విడాకులకు దరఖాస్తు చేశాక రంభ పిల్లల పోషణ భారం కావడంతో మళ్లీ తనకు ఎక్కువ భరణం కావాలని కూడా కోరింది. అయితే అదే సమయంలో రంభతో సన్నిహితంగా ఉండే టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు ఆమెతో మాట్లాడి భార్యాభర్తల మధ్య గొడవను పరిష్కరించేందుకు తన వంతుగా సాయం చేశారన్న టాక్ అప్పట్లో వినిపించింది. ఆయన వల్లనే ఈమె సంసారం చక్కగా ఉందని అందరు భావిస్తున్నారు. ఇటీవల రంభ .. మీనా ఇంట్లో ప్రత్యక్షం అయింది.