Rana : రానా ఆ హీరోయిన్‌ని పిచ్చి పిచ్చిగా ప్రేమించాడా.. య‌వ్వారం ఎక్క‌డ బెడిసి కొట్టింది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 November 2022,12:20 pm

Rana : ద‌గ్గుబాటి వార‌సుడు రానా మంచి న‌టుడు అన్న విష‌యం మ‌నందరికి తెలిసిందే. బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరో సినిమాల‌తోనే కాకుండా ప్రేమాయ‌ణాల‌తో కూడా ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంటాడు. రానా హైదరాబాద్ కి చెందిన మిహికాని క‌రోనా స‌మ‌యంలో సైలెంట్‌గా పెళ్లి చేసుకోగా, వారి వైవాహిక జీవితం స‌జావుగానే సాగుతుంది. అయితే రానా చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయ‌ణంగా సాగించిన‌ట్టు ప్ర‌చారాలు సాగ‌గా అందులో శ్రియా, త్రిషా, బిపాసా బ‌సు, ర‌కుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఉన్నారు.

వీరంద‌రితో రానాకి ఎఫైర్ ఉంద‌ని చాలానే వార్త‌లు వ‌చ్చిన రాగిణి తో ఎఫైర్ కొన‌సాగించాడ‌ని త‌క్కువ‌గానే ప్ర‌చారం జ‌రిగింది. 2009లో క‌న్న‌డ‌లో వ‌చ్చిన వీర మ‌డ‌క్క‌రి సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది రాగిణి. తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన జెండా పైక‌పిరాజు సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌గా, ఈ సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఆమెను ఇక్క‌డ ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రాగిణి మోడ‌ల్ కావ‌డంతో రానాతో ప‌రిచ‌యం ఏర్ప‌డి సాన్నిహిత్యం కూడా పెరిగింద‌ట‌. స‌హ‌జంగానే అప్ప‌టికే త్రిష‌తో బ్రేక‌ప్ అయ్యి ఉండ‌డంతో పాటు రానా ప్లే బాయ్ కావ‌డంతో రానా – రాగిణి బంధంపై ర‌క‌ర‌కాల క‌ట్టుక‌థ‌లు అల్లేశారు.

Rana affair with that heroine

Rana affair with that heroine

మ‌రి ఆ వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నే దానిపై అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. రాగిణి ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ ఇష్యూలో సంజ‌న గ‌ల్రానీతో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. దీంతో ఆమె కెరీర్ మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది. ఇక రానా విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం సోలో హీరోగా కూడా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఓ విభిన్నమైన ప్రేమకథలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి భీమ్లా నాయ‌క్ చిత్రం చేయ‌గా, ఇందులో రానా పాత్ర‌కి మంచి మార్కులే ప‌డ్డాయి.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి