Betting Apps : బెట్టింగ్ యాప్ కేసు.. అడ్డంగా బుక్ అయిన రానా, ప్రకాశ్ రాజ్…!
ప్రధానాంశాలు:
Betting Apps : బెట్టింగ్ యాప్ కేసు.. అడ్డంగా బుక్ అయిన రానా, ప్రకాశ్ రాజ్
Betting Apps : అక్రమ బెట్టింగ్ యాప్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. రమ్మీ సహా వివిధ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అమాయక ప్రజల జేబులు చిల్లి పడటానికి కారణం అవుతున్న సెలబ్రిటీలపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు.

Betting Apps : బెట్టింగ్ యాప్ కేసు.. అడ్డంగా బుక్ అయిన రానా, ప్రకాశ్ రాజ్
Betting Apps వారిపై నిఘా..
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారనే కారణంతో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వారితో పాటు మొత్తంగా 25 మంది సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై మియాపూర్ పోలీసులు కేసులు పెట్టారు. బెట్టింగ్ యాప్‌లు, వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోన్నారనే కారణంతో ఫణీంద్ర శర్మ అనే 32 సంవత్సరాల ఓ బిజినెస్‌మెన్.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలో వారికి నోటీసులు అందజేసే అవకాశం ఉంది. తెలుగు సహా హిందీ నటీనటులకు వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. హీరో, హీరోయిన్లలతో పాటు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై గట్టి నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హర్ష సాయి, ఇమ్రాన్లు దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.