Home » Entertainment » Rana And Venkatesh Fighting On Stage Video
Entertainment

Rana – Venkatesh : స్టేజిపై వెంకటేష్ చొక్కా పట్టుకునేంత పనిచేసిన రానా వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 16, 2023 12:42 pm
Advertisement

Rana – Venkatesh : తెలుగు చలనచిత్ర రంగంలో అతిపెద్ద కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుండి హీరోలు నిర్మాతలు రావడం జరిగింది. దగ్గుబాటి కుటుంబం అంటే మొదటగా గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్…. ఆ తర్వాత రానా ఎంట్రీ అవ్వడం జరిగింది. ఇద్దరికిద్దరూ వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. “రానా నాయుడు” అనే టైటిల్ కలిగిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. చాలా వైవిధ్యమైన స్టొరీతో ఇద్దరు కలిసి నటిస్తున్నారు. రానాకి తండ్రిగా వెంకటేష్ కనిపిస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే స్టోరీ ఇది.

Advertisement

Rana And Venkatesh Fighting On Stage video

ఏ సెలబ్రిటీ ఆపదలో ఉన్న అందరికంటే మొదటిగా రానాకి కాల్ వస్తుంది. డ్రగ్స్.. రొమాన్స్.. యాక్షన్ ఇంకా డబ్బు ఇలా చాలా రకాల కోణాలలో రానా జీవితం ముడిపడి ఉంటుంది. తండ్రి వెంకటేష్ జీవితం కూడా నేరాలతో ఇంకా గొడవలతో ముడిపడి ఉంటుంది. దీంతో తండ్రి జైలు నుంచి విడుదల అయితే ఇంకా ఐదు సంవత్సరాలు జైల్లోనే ఉంటే బాగుండేది అని కొడుకుగా రానా పాత్ర… ఇందులో కనిపిస్తూ ఉంది. మంచైనా చెడైనా కుటుంబం కోసమే చేశాను అని వెంకీ ఈ “రానా నాయుడు” వెబ్ సిరీస్ లో డైలాగ్ ఉంది. ఒకవైపు కార్పొరేట్ అరాచకాలు మరోవైపు తండ్రి కొడుకుల మధ్య జరిగే గొడవల

Advertisement

Rana And Venkatesh Fighting On Stage video

రీతిలో స్టోరీ కనిపిస్తుంది. సుందర్ ఆరో నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కీ కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. మార్చి పదవ తారీకు ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ముంబైలో ట్రైలర్ రిలీజ్ లాంచ్ కార్యక్రమంలో స్టేజి పైనే వెంకటేష్.. రానా తమ పాత్రలలో లీనమైపోయి.. శాంపిల్ గా ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ గొడవలు పడ్డారు. ఈ క్రమంలో రానా వెంకటేష్ చొక్కా పట్టుకునేంత పనిచేయటం వీడియోలో కనిపించడం జరిగింది. దీంతో “రానా నాయుడు” హిందీ ఈవెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి