Rana Daggubati : బాహుబలిలో భ‌ళ్లాల‌దేవుడిగా ముందు రానాని అనుకోలేదా.. హాలీవుడ్ హీరో జ‌స్ట్‌లో మిస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rana Daggubati : బాహుబలిలో భ‌ళ్లాల‌దేవుడిగా ముందు రానాని అనుకోలేదా.. హాలీవుడ్ హీరో జ‌స్ట్‌లో మిస్..!

Rana Daggubati : రాజ‌మౌళి తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో బాహుబ‌లి చిత్రం ఒక‌టి. ఇందులో ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, భ‌ళ్లాల‌దేవుడిగా నెగెటివ్ పాత్ర‌లో రానా క‌నిపించిన సంద‌డి చేశాడు. ఇండస్ట్రీలో గొప్ప పేరున్న దగ్గుబాటి వారి ఇంటి నుంచి వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారు రానా. ఆ ప్రయత్నంలో ఆయన సఫలమయ్యారనే చెప్పాలి. తన కెరీర్‌లో ఆయన చాలా పాత్రలు పోషించారు. కానీ, ఆయన దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Rana Daggubati : బాహుబలిలో భ‌ళ్లాల‌దేవుడిగా ముందు రానాని అనుకోలేదా.. హాలీవుడ్ హీరో జ‌స్ట్‌లో మిస్..!

Rana Daggubati : రాజ‌మౌళి తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో బాహుబ‌లి చిత్రం ఒక‌టి. ఇందులో ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, భ‌ళ్లాల‌దేవుడిగా నెగెటివ్ పాత్ర‌లో రానా క‌నిపించిన సంద‌డి చేశాడు. ఇండస్ట్రీలో గొప్ప పేరున్న దగ్గుబాటి వారి ఇంటి నుంచి వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారు రానా. ఆ ప్రయత్నంలో ఆయన సఫలమయ్యారనే చెప్పాలి. తన కెరీర్‌లో ఆయన చాలా పాత్రలు పోషించారు. కానీ, ఆయన దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ‘బాహుబలి’లోని భళ్లాలదేవుడి పాత్ర. ‘బాహుబలి’ తరవాత రానా చాలా సినిమాలే చేసినా ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు.

Rana Daggubati  ఫ‌స్ట్ ఆప్ష‌న్ రానా కాదా..

అయితే ఇటీవ‌ల ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై ఓ డాక్యుమెంట‌రీ రూపొందించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే రాజ‌మౌళి బాహ‌బ‌లికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. బాహుబ‌లి సినిమా ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భాస్ ద‌గ్గ‌రకి వెళ్లి రాజుల క‌థ‌తో నిన్ను పెట్టి సినిమా చేయాల‌ని అనుకుంటున్నాను. బాహుబ‌లి అనే వీరుడు, యుద్ధానికి వెళ్లిన‌ప్పుడు ఒక్క గాయం లేకుం తిరిగి వ‌స్తాడు అని క‌థ చెప్ప‌డంతో ప్ర‌భాస్ వెంట‌నే ఓకే చేశాడు. అయితే ఇందులో విలన్ పాత్ర‌కి ప్రాముఖ్య‌త బాగా ఉండ‌డంతో ఇందుకోసం హాలీవుడ్ న‌టుడు జేస‌న్ మ‌మోవాను మొద‌ట‌ అనుకున్నారంటా.. ఆక్వామెన్ చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న జేస‌న్ అయితే సినిమాకి మంచి క్రేజ్ వ‌స్తుంద‌ని భావించారు.

Rana Daggubati బాహుబలిలో భ‌ళ్లాల‌దేవుడిగా ముందు రానాని అనుకోలేదా హాలీవుడ్ హీరో జ‌స్ట్‌లో మిస్

Rana Daggubati : బాహుబలిలో భ‌ళ్లాల‌దేవుడిగా ముందు రానాని అనుకోలేదా.. హాలీవుడ్ హీరో జ‌స్ట్‌లో మిస్..!

అయితే నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ రానాను క‌లిసి బాహుబ‌లి క‌థ గురించి తెలిపారు. దీంతో రానా బ‌దులిస్తూ.. నాకంటే ముందు ఈ పాత్ర కోసం ఎవ‌రిని అనుకున్నార‌ని అడ‌గ‌గా, మ‌మోవాను అనుకున్నామ‌ని శోభు చెప్ప‌డంతో ఆ స‌మ‌యంలో రానా న‌వ్వేసి భ‌ళ్లాల దేవుడి పాత్ర‌లో నటించేందుకు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇలాంటివి ఎన్నో విష‌యాలు రాజ‌మౌళి తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌బోతున్నారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది