Home » Entertainment » Rana Daggubati Jealous To Prabhas
Entertainment

Rana Daggubati : ప్రభాస్ అంటే రానాకు అస్సలు ఇష్టం ఉండదా.. అందుకే ఇలా కామెంట్స్ చేశాడా..??

Authored By
aruna
The Telugu News | Published on: October 22, 2023, 10:00 am
Advertisement

Rana Daggubati : సౌత్ ఇండస్ట్రీ లో రానా దగ్గుబాటికి మంచి గుర్తింపు ఉంది. అతడు హీరోగా, నిర్మాతగా, వక్తగా, హోస్ట్ గా ఇలా చాలా పాత్రలని పోషించాడు. ఇండస్ట్రీలో ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. బాహుబలి లాంటి భారీ సినిమాలో బళ్లాలదేవ పాత్రలో ప్రభాస్ కి సమానంగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత రానా తరదైన శైలిలో సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రానా ప్రభాస్ గురించి ఊహించని కామెంట్స్ చేశాడు. రానా ప్రభాస్ పై అసూయతో ఉన్నానని అన్నాడు. అయితే దానికి కారణాలు కూడా ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశంగా మారాడు. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలలో నటిస్తూ దూసుకెళుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ సలార్, కల్కి లాంటి సినిమాలతో దూసుకొస్తున్నాడు. ఇక కల్కి 2898 ఏడి సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

Advertisement

అయితే తాజాగా రానా కల్కి సినిమా సెట్ ను సందర్శించాడు. అక్కడ ప్రభాస్ సినిమా భారీ స్థాయిని చూసి చాలా అసూయపడ్డాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కల్కి సెట్స్ కి వెళ్ళినప్పుడు ఒకరిని చూసి మొదటిసారి అసూయ పడ్డాను. యువకుడిగా ఎదిగే క్రమంలో నాకు విజువల్ ఎఫెక్ట్స్ సినిమా అంటే స్టార్ వార్స్. అలాంటి సినిమాలు చూడడం ఇష్టపడ్డాను. సరదాగా నాగ్ అశ్విన్ కి కూడా అలాంటి జోనర్ ఇష్టం. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ అభిరుచి ఉంటుంది. కల్కి సైన్స్ ఫిక్షన్ సినిమా అని అన్నాడు. కల్కి సినిమా గురించి అద్భుతంగా వర్ణించిన రానా ఇంకా చాలా విషయాలపై మాట్లాడాడు. నేను సెట్ లోకి వెళ్ళినప్పుడు ప్రభాస్ ఈ సినిమాని చేస్తున్నాడు. నేను కలలు కన్నా ప్రతిదాన్ని అతడు చేస్తున్నట్లుగా అనిపించింది.

Rana Daggubati jealous to Prabhas

Advertisement

నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు నేను అతనితో మాట్లాడలేదు. తిరిగి ఇంటికి వెళ్లాను. అతడిని పిలిచి నాకు నిజంగా అసూయగా ఉంది. నాకెందుకో తెలియదు అని చెప్పాను. దీంతో ప్రభాస్ డ్యూడ్ మీరు అసూయ ఫీల్ అయినప్పుడే నేను సరైన పని చేస్తున్నానని నాకు తెలుస్తుంది. ఇది పురాణ ఇతిహాసాల నుండి సైన్స్ ఫిక్షన్ జోడించిన కథ. ఈ సినిమా గురించి నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. హిందీలో భారీ తారాగణం ఉన్నారు. ఈ సినిమాకి ప్రతిదీ అందుబాటులో ఉంది అని తెలిపారు. దీంతో ప్రస్తుతం రానా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక బాహుబలి త్రీ లో ప్రభాస్, రానా కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం రానా పాన్ ఇండియా సినిమా హిరణ్యకశిప సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి