Home » Entertainment » These Heroes Reject Tiger Nageswara Rao Movie
Entertainment

Tiger Nageswara Rao Movie : టైగర్ నాగేశ్వరరావు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!

Authored By
aruna
The Telugu News | Updated on: October 21, 2023 7:33 pm
Advertisement

Tiger Nageswara Rao Movie : దసరా కానుకగా విడుదలైన ‘ టైగర్ నాగేశ్వరరావు ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ ను వంశీ దర్శకత్వం వహించారు. ఇండియన్ సినీ హిస్టరీలో దొంగగా గుర్తింపు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కించారు దర్శకనిర్మాతలు. బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ టాక్ తో దూసుకెళుతున్న ఈ సినిమా మొదటగా ఇద్దరు స్టార్ హీరోల వద్దకు వెళ్లిందట. అయితే వాళ్లు రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ రవితేజ వద్దకు వచ్చిందట. మొదటగా ఈ ఆఫర్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వద్దకు వెళ్లిందట. అక్కడ ఏమైందో తెలియదు కానీ అతడు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా ఆఫర్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లిందట.

Advertisement

అయితే ఆయన కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దీంతో చివరికి మాస్ మహారాజా రవితేజ వద్దకు ఈ స్టోరీ వెళ్ళిందట. అలా ఈ సినిమాలో రవితేజ నటించారు. రవితేజ టాలీవుడ్ లోనే నటించినా ఆయన సినిమాలు హిందీలో డబ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా హిందీలో విడుదల చేశారు. అక్కడ కూడా మంచి టాక్ తో దూసుకెళుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో నిపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లు గా నటించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా కీలక పాత్ర పోషించారు.

These heroes reject Tiger Nageswara Rao Movie

Advertisement

హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటించి మెప్పించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా సూపర్ హిట్ టాక్ను తెచ్చుకున్నా వసూళ్ళ పరంగా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. మొత్తానికి అయితే ఈ సినిమా ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్, చిరంజీవిని దాటి రావడం ఈ ఆఫర్ రవితేజకు దక్కడం అది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ ఈ సినిమాలో తన నటనను ప్రదర్శిస్తారని అందరిని ఆకట్టుకుంటారని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉన్నా ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు. దీంతో రవితేజ ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా వచ్చిందని చెప్పాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి