rana wife gives clarity about personal issue
Rana : చాలా రోజుల వరకు పెళ్లికి దూరంగా ఉన్న రానా ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. 2020 ఆగస్టు8న మిహికా బజాజ్‌ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రానా భార్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఇందుకు కారణం మిహికా పోస్ట్ చేసిన ఫొటోలే.
రానా సతీమణి మిహికా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు.మిహికా సోషల్ మీడియాలో భర్త రానాతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికపుడు షేర్ చేస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత పోస్ట్ చేసిన ఫొటోల కంటే.. ఇటీవల షేర్ చేసిన ఫొటోలో మిహికా కొద్దిగా బొద్దుగా ఉన్నారు. దీంతో అభిమానులు ‘మిహికా మీరు తల్లికాబోతున్నారా?’ అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ‘అలాంటిదేమి లేదు.. పెళ్లి తరువాత అమ్మాయిలో వచ్చే సహజ మార్పు మాత్రమే ఇది’ అని రానా సతీమణి బదులిచ్చారు. మిహికా సమాధానంతో అభిమానులకి నిరాశే ఎదురైంది.ప్రస్తుతం రానాకు 37 ఏళ్లు కాగా..
rana wife gives clarity about personal issue
మిహికాకు 28 ఏళ్లు. త్వరలోనే ఈ జంట శుభవార్తను చెప్తుందేమో చూడాలి. రానా ఇటీవల విడులైన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్ర చేయాడు. పవన్ కళ్యాణ్ పాత్రకు ధీటుగా రానా నటించారు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్ తో కలిసి ‘నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇక విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటించింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషించింది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఓటీటీలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు టాక్.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.