Rana : రానా తండ్రి కాబోతున్నాడా.. మిహికా ఏమంటుంది?

Authored By Sam C | The Telugu News | Updated on : 1 April 2022, 3:30 pm

Rana : చాలా రోజుల వ‌ర‌కు పెళ్లికి దూరంగా ఉన్న రానా ఎట్ట‌కేల‌కు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. 2020 ఆగస్టు8న మిహికా బ‌జాజ్‌ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్యూట్‌ కపుల్‌ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇ​క రానా భార్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఇందుకు కారణం మిహికా పోస్ట్ చేసిన ఫొటోలే.

రానా సతీమణి మిహికా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు.మిహికా సోషల్ మీడియాలో భర్త రానాతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికపుడు షేర్ చేస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత పోస్ట్ చేసిన ఫొటోల కంటే.. ఇటీవల షేర్ చేసిన ఫొటోలో మిహికా కొద్దిగా బొద్దుగా ఉన్నారు. దీంతో అభిమానులు ‘మిహికా మీరు తల్లికాబోతున్నారా?’ అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ‘అలాంటిదేమి లేదు.. పెళ్లి తరువాత అమ్మాయిలో వచ్చే సహజ మార్పు మాత్రమే ఇది’ అని రానా సతీమణి బదులిచ్చారు. మిహికా స‌మాధానంతో అభిమానుల‌కి నిరాశే ఎదురైంది.ప్రస్తుతం రానాకు 37 ఏళ్లు కాగా..

rana wife gives clarity about personal issue

rana wife gives clarity about personal issue

Rana : రానా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్…

మిహికాకు 28 ఏళ్లు. త్వరలోనే ఈ జంట శుభవార్తను చెప్తుందేమో చూడాలి. రానా ఇటీవల విడులైన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్ర చేయాడు. పవన్ కళ్యాణ్ పాత్రకు ధీటుగా రానా నటించారు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్ తో కలిసి ‘నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇక విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటించింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషించింది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఓటీటీలో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నట్టు టాక్.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి