Rashi khanna : ట్రైనర్‌తో అలా.. చెమటోడ్చుతున్న రాశీ ఖన్నా
Rashi khanna : రాశీ ఖన్నా ఒకప్పుడు ఎంత బొద్దుగా ఉండేదో అందరికీ తెలిసిందే. చబ్బీగా, భారీ అందాలతో అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా రాశీ ఖన్నా మాత్రం జీరో సైజ్‌లోకి మారిపోయింది. ఇలా మారడానికి దాదాపు ఏడాదికి పైగా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన కోసం తన ట్రైనర్ కుల్దీప్ ఎంతో పరిశోధన చేశాడని, తనకు తగ్గ ఫుడ్ కోసం సర్చ్ చేశాడని, లిమిటెడ్ డైట్‌ను ప్లాన్ చేసి ఎంతో గైడ్ చేశాడని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

Rashi khanna
అయితే రాశీ ఖన్నా ఇంకా బక్క పల్చగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇంకా జిమ్‌లోనే తెగ కష్టపడుతోంది. అసలే ఇప్పుడు రాశీ ఖన్నా నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయింది. ఫ్యామిలీ మెన్ సిరీస్ తీసిన రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో రాబోతోన్న వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా నటిస్తోంది. అంతే కాకుండా రాశీ ఖన్నా ఇప్పుడు కోలీవుడ్‌లో ఫుల్ ఫేమస్ అవుతోంది. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో రెండు కోలీవుడ్ ప్రాజెక్ట్‌లున్నాయి.
Rashi khanna : ట్రైనర్‌తో అలా.. చెమటోడ్చుతున్న రాశీ ఖన్నా
ఆ మధ్య రాశీ ఖన్నా గోవా హైద్రాబాద్ చెన్నై కొచ్చి అంటూ వరుసగా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఫుల్ బిజీగా గడిపింది. ఇప్పుడు రాశీ ఖన్నా జిమ్‌లో తెగ చెమటోడ్చుతోంది. ఈ మేరకు జిమ్‌లో ఖాళీ సమయంలో ట్రైనర్‌తో కబుర్లు చెబుతూ సెల్ఫీలు దిగుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి రాశీ ఖన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో రాశీ ఖన్నాకు అవకాశాలు మాత్రం రావడం లేదు.