Rashi : రాశి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. వందల కోట్ల సంపదను అందుకే వదులుకుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashi : రాశి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. వందల కోట్ల సంపదను అందుకే వదులుకుందా?

 Authored By mallesh | The Telugu News | Updated on :19 September 2022,1:30 pm

Rashi : తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రాశి అంటే చాలా ఇష్టం. ఈమె సినిమాలకు, నటనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందట.. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా ఎంతో మందిని అలరించిన రాశి .. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్‌లో చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక తన సినీ కెరీర్‌ను తన భర్త కోసం వదిలేసిన రాశి ఖన్నా.. చాలా కాలం తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. రాశి సినిమాల్లో బిజీగా ఉన్న టైంలో చాలా డబ్బులు సంపాదించింది. ఆ సమయంలోనే తనకు కోటీశ్వరుల సంబంధాలు చాలా వచ్చాయట.

కానీ తను మాత్రం ప్రేమించిన వ్యక్తినే చేసుకుంటానని ఇంట్లోవారితో వాదనకు దిగిందట.. చివరకు పెద్దవాళ్ల అంగీకారంతో పెళ్లిచేసుకన్న అందాల రాశి .. ఆ తర్వాత సినిమాలకు దూరం కావడంతో ఆమె అభిమానులు చాలా నిరాశకు గురయ్యారట.. అయితే, రాశి భర్త ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్. అప్ప‌ట్లో చాలా మంది హీరోలు రాశి డేట్ల కోసం వేచి చూశారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో పలు విజయాలు సాధించి బాగా డబ్బులు సంపాదించుకున్న రాశి .. కొంతకాలానికి సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది.

Rashi Khanna love story

Rashi Khanna love story

Rashi : డబ్బుల కంటే ప్రేమకే జై కొట్టిన రాశి ..

కానీ క‌థ‌ల ఎంపిక‌ విషయంలో త‌డ‌బాటు వ‌ల్ల నిర్మాత‌గా న‌ష్ట‌పోయింది. కొంతకాలానికి రాశి తండ్రి మ‌ర‌ణంతో ఆమె చాలా కుంగిపోయిందట..అదే టైంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీముని ఆమెకు ధైర్యం చెప్పి దగ్గరుండి బాగోగులు చూసుకున్నాడట. దీంతో శ్రీమునిలోని కేరింగ్ నచ్చి రాశి అతనితో ప్రేమలో పడిందని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ నడచింది. అప్పటికీ రాశిని పెళ్లి చేసుకోవ‌డానికి బ‌డా వ్యాపావేత్త‌లు, ఎన్ఆర్ఐలు సైతం ఆస‌క్తి చూపించారు. కానీ రాశి మాత్రం త‌న‌కు తోడుగా నిలిచిన శ్రీమునినే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి త‌ర‌వాత సినిమాలు మానేసి గృహిణిగా మారిపోయింది. కాగా, రాశి లవ్ స్టోరీని చాలా మంది మెచ్చుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది