Rashmi Gautam : సుధీర్‌ని నిండా ముంచేసిన రష్మీ.. వేరే యాంకర్‌కి ముద్దులిస్తానంటూ ఓపెన్ స్టేట్‌మెంట్..!
ప్రధానాంశాలు:
Rashmi Gautam : సుధీర్‌ని నిండా ముంచేసిన రష్మీ.. వేరే యాంకర్‌కి ముద్దులిస్తానంటూ ఓపెన్ స్టేట్‌మెంట్..!
Rashmi Gautam : బుల్లితెర క్రేజీ జంటలలో సుడిగాలి సుధీర, రష్మీ గౌతమ్ జంట ఒకటి. గడిచిన కొన్నేళ్ల క్రితం వరకు బుల్లితెరపై బెస్ట్ జోడిగా పేరుపొందిన యాంకర్ లలో సుధీర్ , రష్మీ జంట కూడా ఒకటి. ముఖ్యంగా రష్మీకి తెలుగు రాకపోయినా సరే సుధీర్ తో కలిసి చేసినటువంటి స్కిట్స్ , షోలు వంటివి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో ఈమెకు హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకునేలా చేశాయి. ఇప్పటికీ యాంకర్ గా జబర్దస్త్ షో తో పాటు ఇతర షోలలో చేస్తూ ఉంది రష్మి. రష్మి యాంకర్ కాకముందు ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. కానీ అవేవీ ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కేవలం జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
Rashmi Gautam సుధీర్‌కి బిగ్ హ్యాండ్..
రష్మీ గౌతమ్ కి పాపులారిటీ తెచ్చిన అంశాల్లో సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ కూడా ఒకటి. బుల్లితెర లవ్లీ ఫెయిర్ గా సుధీర్-రష్మీ పేరు తెచ్చుకున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో వీరికి ఉత్తుత్తి పెళ్లి చేశారు. సాంగ్స్, స్కిట్స్ లో నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. సుధీర్-రష్మీ నిజమైన ప్రేమికులు అని నమ్మేవారు లేకపోలేదు. సుధీర్ తో మీ పెళ్లి ఎప్పుడని రష్మీ గౌతమ్ ని తరచుగా అడుగుతూ ఉంటారు. తాజాగా ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న రష్మీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ అభిమాని… చెంపదెబ్బ, వార్నింగ్, ముద్దు… ఇవ్వాల్సి వస్తే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ లలో ఎవరికి ఏమిస్తావని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా… హైపర్ ఆదికి చెంప దెబ్బ ఇస్తాను. ఎందుకంటే టీజ్ చేస్తూ ఉంటాడని చెప్పింది.
ఇక సుడిగాలి సుధీర్ కి వార్నింగ్ ఇస్తుందట. ముద్దు మాత్రం యాంకర్ ప్రదీప్ కి ఇస్తుందట. సుడిగాలి సుధీర్ కి షాక్ ఇస్తూ ప్రదీప్ కి ముద్దు ఇస్తానన్న రష్మీ… సుధీర్ కి మాత్రం వార్నింగ్ ఇస్తానని చెప్పింది. రష్మీ గౌతమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటుగా తనకి 100 ఎకరాల ల్యాండ్ ఉంది అనే పుకార్లపై కూడా రష్మీ హాట్ కామెంట్స్ చేసింది. నాకు 100 ఎకరాలు అయితే లేవు కానీ తన అమ్మ తరపున ఒరిస్సా సైడ్ కొంచెం ఎక్కువ ఎకరాలే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్ గా తన పెళ్లిపై అలాగే తనకి ఎలాంటి వాడు భర్తగా కావాలి అనే వాటికీ సమాధాన ఇస్తూ తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని తేల్చేసింది.