Rashmi Gautam : తొమ్మిది అయ్యింది… ఇంకా ఏం కావ‌డం లేదు.. సుధీర్‌పై రష్మీ కామెంట్స్..!

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 2, 2021, 9:30 pm

Rashmi Gautam బుల్లితెరపై ఎక్కువ కాలం సాగుతూ వస్తోన్న ట్రాక్ ఏదైనా ఉందా? అంటే అది రష్మీ సుధీర్‌దే. గత తొమ్మిదేళ్లుగా ఈ ఇద్దరూ బుల్లితెరపై రచ్చ చేస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతోన్నారంటూ వార్తలు కోడై కూశాయి. దానికి తగ్గట్టు జబర్దస్త్ టీం ఎక్కువగా ఈ ట్రాక్ మీద వర్కవుట్ చేసింది. పండుగలు వస్తే చాలు ఈ ట్రాక్ మీదే ఈవెంట్లు ప్లాన్ చేసేంది. అలా రెండు ఈవెంట్లలో సుధర్ రష్మి పెళ్లిని చేసేశారు.

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

అలా రష్మీ సుధీర్ జంటకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే వస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఢీ షోలోనూ రొమాన్స్ చేస్తుంటారు. వారికి తోడు ఆది, దీపిక పిల్లి ట్రాక్‌ను కూడా పెట్టారు. గత సీజన్లో వర్షిణితో ఆది నడిపించిన ట్రాక్ వర్కవుట్ అయింది. కానీ దీపిక పిల్లితో ట్రాక్ సెట్ అవ్వడం లేదు. తాజాగా వదిలిన ప్రోమోలో ఈ నలుగురు దుమ్ములేపేశారు. ఆర్య స్టైల్లో సుధీర్ రష్మీ ట్రాక్ నడిపించారు. పార్కులో రష్మీ కూర్చున్నట్టుగా స్కిట్ వేసింది. సుధీర్ సైకిల్ మీద రష్మీ చుట్టూ చక్కర్లు కొట్టేశాడు.

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

Rashmi Gautam ఆది దీపిక అలా.. రష్మీ సుధీర్ ఇలా..

పార్క్‌కు వచ్చాం.. తొమ్మిది దాటేసింది.. ఏంటి మరి? అని సుధీర్ అదోలా అడిగేశాడు. ఏంటి మరి అంటూ రష్మీ కూడా కొంటెగా అడిగింది. ఇక ఆది సైతం దీపికతో ప్రేమించుకుందాం రా సినిమా ట్రాక్ వేశారు. సుధీర్ స్టైల్లో ఆది డైలాగ్ కొట్టేశాడు. నేను ఎక్కితే నువ్ సైకిల్ తొక్కుతావో లేదో గానీ నువ్ ఎక్కితే మాత్రం నేను తొక్కుతాను అంటూ కౌంటర్ వేశాడు. వచ్చి ఏడాది అవుతోంది.. ఏం లేదా? అని దీపికతో ఆది అంటే.. తొమ్మిదికే ఏం అవ్వడం లేదు.. ఏడాదికి ఏం అవుతుంది అని సుధీర్ ట్రాక్ గురించి రష్మీ చెప్పింది. మీద తొమ్మిది కాదు పందొమ్మిది అయినా ఏం అవ్వదు అని మాకు తెలుసు అని సుధీర్ రష్మీ ట్రాక్ పరువుతీశాడు ఆది.

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp