RRR : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
RRR : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. నిజానికి ఈ చిత్రం దసరా సందర్భంగా ఈ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ, వాయిదా పడింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

rrr Movie release date is fixed
RRR జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల
వచ్చే ఏడాది జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ‘బాహుబలి’ తర్వాత వస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీంగా ఈ మూవీలో కనిపించనున్నారు.
ఇకపోతే తారక్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా కనిపించనుండగా, చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటించింది. మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, ఆలియా భట్, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ రిలీజ్ పోస్టర్‌లో పోలీస్ గెటప్‌లో కనిపించడం విశేషం.