Rashmi Gautam : ఇంత నీచమా?.. రష్మి గౌతమ్ పై దారుణమైన కామెంట్లు

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 3, 2022, 6:30 pm

Rashmi Gautam : యాంకర్ రష్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వీధి కుక్కలను ఇంటికి తెచ్చి మరీ పెంచుకుంటూ ఉంటుంది. ఏ వీధి కుక్క అయినా అపస్మారక స్థితిలో ఉండి, గాయాలతో బాధపడుతుంటే రష్మీ చూస్తూ ఊరుకోదు. వాటిని ఇంటికి తీసుకొచ్చి, వైద్యం చేయించి మరీ పెంచుకుంటూ ఉంటుంది. అలా ఇప్పుడు రష్మీ వద్ద చుట్కీ అనే ఓ పెట్ ఉంది.

అదంటే రష్మీకి ప్రాణం. మూగ జీవులను ఇంతగా ప్రేమించే రష్మీ అంటే కొంత మందికి అభిమానం. కానీ ఇంకొంత మంది మాత్రం రష్మీని దారుణంగా బూతులతో ట్రోల్ చేస్తుంటారు. రష్మీని నెగెటివ్ కామెంట్లతో హింసిస్తుంటారు. తాజాగా అలాంటి కొన్ని చెత్త కామెంట్లపై రష్మీ స్పందించింది. చుట్కీ అంటే ప్రాణం..దాన్ని వదిలి ఉండలేనంటూ రష్మీ ఓ పోస్ట్ చేసింది.దాని మీద నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. పచ్చి బూతులతో రష్మీ మీద దాడి చేశారు.

Anchor Rashmi Gautam Fires On Netizen Abusive Comments

Anchor Rashmi Gautam Fires On Netizen Abusive Comments

 

Rashmi Gautam : నెటిజన్లపై మండిపడ్డ రష్మీ..

కుక్కతోనే చేసుకో అంటూ అడ్డూ అదుపూ లేకుండా నీచాతి నీచమైన కామెంట్లు చేశారు. అలాంటి వాటిపై రష్మీ స్పందించింది. అందరికీ ఓ దండం పెట్టేసింది. అలా ఎలా మాట్లాడతారు.. ఎలా ఊహించుకుంటారు.. ఇలాంటి వాళ్లు ఎక్కడి నుంచి వస్తారు..నన్ను, నా పోస్ట్‌లను మీరు వ్యతిరేకించొచ్చు.. నేను మీకు నచ్చకపోవచ్చు కానీ ఇలాంటి చెత్త మాటలు ఎలా అనగలుగుతున్నారు అంటూ రష్మీ ఆవేదన చెందింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp