Rashmi Gautam : పెద్ద ఇళ్లు కానీ.. మనసులు మాత్రం చాలా చిన్నవి.. అమ్మదనం ఎక్కడికిపోయింది.. యాంకర్ రష్మీ ఆవేదన

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 28, 2022, 7:00 pm

Rashmi Gautam : యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రష్మీ మూగ జీవాల కోసం ఎంతో పాటు పడుతుంటుంది. రష్మీ పెట్స్ కోసం సహాయ కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇక రష్మీ కోళ్లు, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏ ఒక్క జంతువుకి కష్టం వచ్చినా, వాటిని హింసించినా కూడా రష్మీ కదిలి వస్తుంటుంది. వాటిని సంరక్షించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తుంది. వీధుల్లో కుక్కలను హింసించే వారికి శిక్ష పడేలా చేస్తుంటుంది. అలా రష్మీ నిత్యం పెట్స్‌కు సంబంధించిన స్టోరీలను షేర్ చేస్తుంటుంది. తాజాగా రష్మీ ఓ వీడియోను వదిలింది.

అందులో ఓ స్వచ్చంద సంస్థకు సంబంధించిన వాలంటీర్లు కనిపిస్తున్నారు. వారంతా కూడా వీధి కుక్కలను ఫీడ్ చేసేందుకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఓ ధనవంతుల ఫ్యామిలీ దురహంకారాన్ని రష్మీ చూపించింది. పెద్ద ఇళ్లు కట్టుకున్నాడు.. కానీ వారి మనసు మాత్రం ఇలా ఉందంటూ వారి పరువు తీసింది. కుక్కలను వారు ఫుడ్ పెడుతుంటే.. వద్దని గొడవకు దిగేశాడు. పైగా వాలంటీర్ల మీద దురుసుగా ప్రవర్తించాడు. ఆ తరువాత ఓ మహిళ కూడా అలానే ప్రవర్తించింది. మహిళలోని మాతృత్వం ఎక్కడికిపోయింది.. ఆమె కూడా ఇలానే ప్రవర్తిస్తోంది?.. అంటూ మహిళను ఉద్దేశించి రష్మీ పోస్ట్ వేసింది.

Rashmi Gautam Fires on Not Leeting Feed To Strays

Rashmi Gautam Fires on Not Leeting Feed To Strays

మొత్తానికి రష్మీ మాత్రం వీధి కుక్కల కోసం పోరాడుతూనే ఉంటోంది. వీధుల్లో గాయపడిన కుక్కల కోసం రష్మీ చేతనైన సాయం చేస్తుంది. అలా గాయపడిన ఓ కుక్కని తెచ్చుకుని రష్మీ పెంచుకుంటోంది. కరోనా సమయంలో రష్మీ వీధి కుక్కల కోసం రోడ్డు మీదకు వచ్చింది. వాటికి ఆహారాన్ని అందించింది. అలా ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తుంటుంది రష్మీ. తన పోస్టుల ద్వారా కొంతమందైనా మారుతారని ఆశిస్తుంటుంది. చర్మంతో తయారు చేసే వస్తువులు, మాంసాహారానికి దూరంగా ఉండాలంటూ అందరినీ వేడుకుంటుంది. ఇక రష్మీ పోస్టులకు ఎక్కువ సంఖ్యలో మద్దతు లభిస్తుంటుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp