
Rashmi Gautam Fires on Not Leeting Feed To Strays
Rashmi Gautam : యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రష్మీ మూగ జీవాల కోసం ఎంతో పాటు పడుతుంటుంది. రష్మీ పెట్స్ కోసం సహాయ కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇక రష్మీ కోళ్లు, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏ ఒక్క జంతువుకి కష్టం వచ్చినా, వాటిని హింసించినా కూడా రష్మీ కదిలి వస్తుంటుంది. వాటిని సంరక్షించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తుంది. వీధుల్లో కుక్కలను హింసించే వారికి శిక్ష పడేలా చేస్తుంటుంది. అలా రష్మీ నిత్యం పెట్స్‌కు సంబంధించిన స్టోరీలను షేర్ చేస్తుంటుంది. తాజాగా రష్మీ ఓ వీడియోను వదిలింది.
అందులో ఓ స్వచ్చంద సంస్థకు సంబంధించిన వాలంటీర్లు కనిపిస్తున్నారు. వారంతా కూడా వీధి కుక్కలను ఫీడ్ చేసేందుకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఓ ధనవంతుల ఫ్యామిలీ దురహంకారాన్ని రష్మీ చూపించింది. పెద్ద ఇళ్లు కట్టుకున్నాడు.. కానీ వారి మనసు మాత్రం ఇలా ఉందంటూ వారి పరువు తీసింది. కుక్కలను వారు ఫుడ్ పెడుతుంటే.. వద్దని గొడవకు దిగేశాడు. పైగా వాలంటీర్ల మీద దురుసుగా ప్రవర్తించాడు. ఆ తరువాత ఓ మహిళ కూడా అలానే ప్రవర్తించింది. మహిళలోని మాతృత్వం ఎక్కడికిపోయింది.. ఆమె కూడా ఇలానే ప్రవర్తిస్తోంది?.. అంటూ మహిళను ఉద్దేశించి రష్మీ పోస్ట్ వేసింది.
Rashmi Gautam Fires on Not Leeting Feed To Strays
మొత్తానికి రష్మీ మాత్రం వీధి కుక్కల కోసం పోరాడుతూనే ఉంటోంది. వీధుల్లో గాయపడిన కుక్కల కోసం రష్మీ చేతనైన సాయం చేస్తుంది. అలా గాయపడిన ఓ కుక్కని తెచ్చుకుని రష్మీ పెంచుకుంటోంది. కరోనా సమయంలో రష్మీ వీధి కుక్కల కోసం రోడ్డు మీదకు వచ్చింది. వాటికి ఆహారాన్ని అందించింది. అలా ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తుంటుంది రష్మీ. తన పోస్టుల ద్వారా కొంతమందైనా మారుతారని ఆశిస్తుంటుంది. చర్మంతో తయారు చేసే వస్తువులు, మాంసాహారానికి దూరంగా ఉండాలంటూ అందరినీ వేడుకుంటుంది. ఇక రష్మీ పోస్టులకు ఎక్కువ సంఖ్యలో మద్దతు లభిస్తుంటుంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.