Rashmi Gautam : ప్ర‌కృతి ఒడిలో ఒదిగిపోయిన ర‌ష్మీ గౌత‌మ్.. ట్రెడిష‌న‌ల్ లుక్‌లోను క‌ట్టిప‌డేస్తున్నావుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : ప్ర‌కృతి ఒడిలో ఒదిగిపోయిన ర‌ష్మీ గౌత‌మ్.. ట్రెడిష‌న‌ల్ లుక్‌లోను క‌ట్టిప‌డేస్తున్నావుగా..!

Rashmi Gautham : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ గౌతమ్ చాలా సుప‌రిచితం. ర‌ష్మీ అంటే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు. ఓ వైపు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :2 July 2022,2:30 pm

Rashmi Gautham : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ గౌతమ్ చాలా సుప‌రిచితం. ర‌ష్మీ అంటే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు. ఓ వైపు టీవీల్లో యాంకరింగ్, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ర‌ష్మీ ప్ర‌తి వారం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది. జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న‌ రష్మీ గౌతమ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. ప‌లు ఈవెంట్స్ కోసం చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. అయితే ఇటీవ‌ల ఈ జోడి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

Rashmi Gautam green color saree looks viral

Rashmi Gautam green color saree looks viral

Rashmi Gautam : మ‌న‌సు దోచుకుంటున్న ముద్దుగుమ్మ‌

అభిమానులు తిరిగి క‌ల‌వాలని అనుకుంటున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ర‌ష్మీ గౌత‌మ్ స‌మాజంలో స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే త‌న ఫొటో షూట్స్ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ చీర కట్టులో వయ్యారాలు పోతున్న పిక్స్ ని షేర్ చేసింది. గ్రీన్ క‌ల‌ర్ శారీలో ప్ర‌కృతి అందాల మ‌ధ్య‌ ఆమె ఇచ్చిన ఫోజులు ఆకర్షించే విధంగా ఉన్నాయి. గ్లామర్ హద్దులు దాటకుండా చిరునవ్వులు చిందిస్తూ రష్మీ మెస్మరైజ్ చేస్తోంది. చిరునవ్వు, కొంటె చూపులతోనే కుర్రాళ్లకు బాణాలు సంధిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది