Rashmi Gautam : రష్మీ గౌతమ్ తన పర్సనల్ విషయాలను ఎంతో ప్రైవేట్‌గా ఉంచుకుంటుంది. ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత విషయాలను మీడియా ముందుకు తీసుకురాలేదు. తన పర్సనల్ విషయాల మీద ఎఫ్పుడూ స్పందించదు. అయితే రష్మీ పర్సనల్ లైఫ్ మీద ఎన్నో రూమర్లు వినిపిస్తుంటాయి. రష్మికి ఇది వరకే పెళ్లైయిందని, విడాకులు కూడా తీసుకున్నారంటూ ఇలా రకరకాల కథనాలు వస్తుంటాయి. ఇక రష్మీ పేరెంట్స్ విషయంలోనూ అలానే జరిగిందని అంటుంటారు. రష్మీ తల్లి సింగిల్ పేరంట్ అని తెలిసిందే. రష్మీని తన తల్లే పెంచింది. పోషించింది. రష్మికి తండ్రి లేడు. తండ్రి చనిపోయాడో.. లేదంటే.. వీరికి దూరంగా ఉంటున్నాడో తెలియదు.
కానీ మొత్తానికి రష్మీ, తన తల్లి మాత్రమే కలిసి ఉంటారు. వైజాగ్‌లో రష్మీ ఉంటుంది. ఆమె ఒడిశాకు చెందిన అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. మొత్తానికి రష్మీ మాత్రం చాలా కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చింది. ఒంటరిగానే కష్టపడింది. ఇప్పుడు తన తల్లిని ఎంతో బాగా చూసుకుంటోంది. అయితే తాజాగా రష్మీ ఎమోషనల్ అయింది. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ ఈవెంట్ చేయబోతోంది. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ షోను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పవిత్ర, రష్మీ, వర్ష వంటి వారు ఎమోషనలయ్యారు.
అయితే ఇందులో రష్మీ తన తండ్రి గురించి పరోక్ష స్పందించింది. తన తండ్రి గురించి చెప్పడం ఇష్టం లేక, చెడుగా చెప్పలేక అలా వదిలేసినట్టు కనిపిస్తోంది. పేరెంట్స్‌లో చెడ్డ పేరెంట్స్ ఉంటారో లేదో నాకు తెలియదు.. అయినా సరే హ్యాపీ ఫాదర్స్ డే అంటూ రష్మీ స్టేజ్ మీదే ఎమోషనల్ అయింది. రష్మీ తన సింగిల్ పేరెంట్ కష్టాలను ఇది వరకే చెప్పేసింది. తనను తన అమ్మే పెంచింది.. పోషించిందని, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియదని ఇది వరకు కొన్ని పండుగ ఈవెంట్లలలో రష్మీ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఫాదర్ సెంటిమెంట్‌తో ఏడిపించేలా ఉన్నారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.