Sudigali Sudheer : ఇన్ని రోజులుగా ఫ్రీగా చూస్తున్నాను.. సుధీర్ ప‌రువు తీసిన రష్మీ గౌత‌మ్‌..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 22 January 2022, 6:35 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ను బుల్లితెరపై అందరూ ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. ప్రతీ ఒక్కరూ సెటైర్లు వేస్తుంటారు. జూనియర్లు, సీనియర్లు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సుధీర్‌ను కించపరుస్తూ కామెంట్లు చేస్తుంటారు. అవి స్కిట్లో భాగంగానే అయినా కూడా సుధీర్‌ను మాత్రం అందరూ కలిసి ఆడేసుకుంటారు. ఒకప్పుడు జనాలు కూడా వాటిని బాగానే ఎంజాయ్ చేశారు.

కానీ క్రమక్రమంగా సుధీర్ క్రేజ్ పెరుగుతూ వచ్చింది. బుల్లితెరపై స్టార్‌గా సుధీర్ మారిపోయాడు. ఇక అప్పటి నుంచి సుధీర్ మీద వేసే వెకిలి జోకులను అభిమానులు సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. అవి కామెడీ స్కిట్లే అయినా కూడా మరీ అంతగా కించపరచాలా? అని ఫైర్ అవుతుంటారు. తాజాగా రష్మీ, రోజా, గలటా గీతు వంటి వారు రెచ్చిపోయారు.

rashmi gautam Saiters On Sudigali Sudheer As Pushpa Raj In Jabardasth

rashmi gautam Saiters On Sudigali Sudheer As Pushpa Raj In Jabardasth

Sudigali Sudheer : రెచ్చిపోయిన రష్మీ, రోజా

సుధీర్ పుష్ప రాజ్‌లా గెటప్ వేశాడు. సుధీర్ మొహం చూడాలంటే లక్ష కావాలి.. లేకపోతే వాడి మొహం ఎవడు చూస్తాడు అంటూ గలాట గీతు కామెంట్ చేస్తుంది. అంటే నేనే ఇన్నాళ్లూ ఫ్రీగా చూస్తున్నానా? అని రష్మీ గౌత‌మ్‌ మరో పంచ్ వేస్తుంది. ఇక వీడ్నీ చూస్తే బేవార్స్ అనిపించలేదా? అని రోజా కౌంటర్ వేస్తుంది. అట్నే ఉన్నాడంటూ గీతూ కూడా రెచ్చిపోతుంది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి