Sudigali Sudheer : ఎక్కడ నొక్కినా చేస్తాడట.. సుడిగాలి సుధీర్ ప‌రువు తీసిన ర‌ష్మీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : ఎక్కడ నొక్కినా చేస్తాడట.. సుడిగాలి సుధీర్ ప‌రువు తీసిన ర‌ష్మీ..!

Sudigali Sudheer : బుల్లితెర‌పై క్రేజీ జంట‌ల‌లో ర‌ష్మీ- సుడిగాలి సుధీర్ జంట ఒక‌టి. సుధీర్, రష్మీల లవ్ ట్రాక్‌‌కి పనిచెప్పాల్సిందే అన్నట్టుగా మసాలా దట్టిస్తుంటారు. దుమ్ము రేపే డాన్స్ పెర్ఫార్మన్స్ ల మధ్య రష్మీ, సుధీర్ రొమాన్స్ హైలెట్ గా నిలిచేది. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దానిని ఈ కార్యక్రమం కోసం తెలివిగా వాడుకున్నారు. ర‌ష్మీతో సుధీర్ డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన […]

 Authored By sandeep | The Telugu News | Updated on :5 March 2022,7:30 pm

Sudigali Sudheer : బుల్లితెర‌పై క్రేజీ జంట‌ల‌లో ర‌ష్మీ- సుడిగాలి సుధీర్ జంట ఒక‌టి. సుధీర్, రష్మీల లవ్ ట్రాక్‌‌కి పనిచెప్పాల్సిందే అన్నట్టుగా మసాలా దట్టిస్తుంటారు. దుమ్ము రేపే డాన్స్ పెర్ఫార్మన్స్ ల మధ్య రష్మీ, సుధీర్ రొమాన్స్ హైలెట్ గా నిలిచేది. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దానిని ఈ కార్యక్రమం కోసం తెలివిగా వాడుకున్నారు. ర‌ష్మీతో సుధీర్ డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన ప్రయోగాలు మొత్తం చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఢీ షోల‌ను ఈ జంట తెగ సంద‌డి చేసే వారు. అయితే తాజా సీజ‌న్‌కి రష్మీ, సుధీర్ లేని కారణంగా ఓ సెక్షన్ ఆడియన్స్ షోకి దూరం అయ్యారని మాత్రం అంచనా వేయవచ్చు.

సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌.. ఈ రెండు పేర్లు గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రి జోడీ జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. వీరి జంట‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అస‌లు సుడిగాలి సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్‌.. త‌మ క్రేజ్‌ను బేస్ చేసుకుని త‌మ రెమ్యున‌రేష‌న్స్ పెంచాల‌ని గ‌ట్టిగా కోర‌డంతో, జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు వారిని ప‌క్క‌న పెట్టారంటూ కూడా వార్త‌లు గట్టిగానే వినిపించాయి. అయితే ఏం జ‌రిగిందో ఏమో కానీ.. మ‌ళ్లీ సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ జంట జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌లో సంద‌డి చేయ‌డానికి వ‌చ్చేశారు. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద్‌ద‌స్త్‌లో వీరి హంగామాను చూపిస్తూ స్టేజ్‌పై తెగ సంద‌డి చేస్తున్నారు.

rashmi gautam satires on sudigali sudheer

rashmi gautam satires on sudigali sudheer

Sudigali Sudheer : పంచ్‌లు మాములుగా లేవు..

తాజాగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ స్కిట్‌లో ఈ జంట చేసిన ర‌చ్చ మాములుగా లేదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ జోక‌ర్ మాదిరిగా మారి తెగ సంద‌డి చేశాడు. సుధీర్ ని బొమ్మ అని ప‌రిచ‌యం చేస్తూ గిఫ్ట్ గా ఇస్తాడు రాం ప్ర‌సాద్. చిన్న పిల్లాడిలా మారి శ్రీను తెగ సంద‌డి చేస్తాడు. అయితే బొమ్మ‌తో డ్యాన్స్ చేయాల‌ని రోహిణి ఆశ ప‌డ‌గా, ఎక్క‌డ నొక్కాల‌ని అడ‌గగా ఎక్క‌డ నొక్కిన చేస్తాడని ర‌ష్మిక అన‌డంతో న‌వ్వులు విర‌బూసాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వీరి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది