Manjula : తెలుగు డిజిటల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. డాక్టర్ బాబు భార్య న్యూ స్టెప్
Manjula : కార్తీకదీపం సీరియల్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కార్తీక దీపం సీరియల్‌తో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల.ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నాడు నిరుపమ్.అలనాటి నటుడు, డైలాగ్ రైటర్ ఓంకార్ కుమారుడే నిరుపమ్.ఇక ఈయన మరో బుల్లితెర నటి మంజుల ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.వీరికి అక్షర ఓంకార్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే మంజుల పరిటాల తర్వలో డిజిలట్ ప్లాట్‌ఫాంలో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉంది. కొంచెం కారం కొంచెం తీపి పేరుతో యూట్యూబ్, జెమినీ టీవీలో తెగ సందడి చేయనుంది. దాదాపు 80 ఎపిసోడ్స్ రూపొందనున్న ఈ సీరియల్ ప్రత ఒక్కరిని అలరిస్తుందని అంటున్నారు. అంతేకాక తమని ప్రతి ఒక్కరు తమని సపోర్ట్ చేయమని కోరుతుంది మంజుల. ఇక ఈ మధ్య సీరియల్స్ కు దూరమవ్వగా అప్పుడప్పుడు బుల్లితెరలో జరిగే కొన్ని ఈవెంట్లలో, కొన్ని షోలలో పాల్గొంటుంది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ భాషల్లో కూడా పలు సీరియల్స్ లో నటించింది.అక్కడ కూడా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

manjula new step can creates the winder
Manjula : మంజుల రచ్చ మాములుగా ఉండదు మరి..
తెలుగు లో చంద్రముఖి తర్వాత తరంగాలు, కాంచన గంగ, అమ్మాయి కాపురం, నీలాంబరి, చంద్రలేఖ వంటి సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకుంది. చాలా వరకు అన్ని ఛానల్స్ లో నటించింది మంజుల పరిటాల. కేవలం మంజుల నే కాకుండా తన చెల్లి మరిది కూడా టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు.ఇక మంజుల అందంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.రీల్స్ కూడా చేస్తూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్లీ సీరియల్స్ లో అడుగు పెట్టింది.త్వరలో జెమిని ఛానెల్లో ప్రసారం కానున్న ‘కొంచెం కారం కొంచెం తీపి’ అనే ఓ డైలీ సీరియల్ లో నటిస్తుంది. ఇక ఈ సీరియల్ కాస్త కొత్తదనంతో ప్రారంభం కానుంది.