Jabardasth Naresh : షబీనాతో ట్రాక్ క్లోజ్.. కొత్త పోరితో పొట్టి నరేష్ రొమాన్స్
Jabardasth Naresh :బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ ప్రేక్షకులకి ఎంత వినోదం పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో కొన్ని జంటలు ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచుతుంటాయి. ముఖ్యంగా పొట్టి నరేష్ తెగ అలరిస్తుంటాడు. గత కొద్ది రోజులుగా షబీనాతో ట్రాక్ నడిపిన నరేష్ ఇటీవలి కాలంలో ఎవరో కొత్త అమ్మాయితో ట్రాక్ నడుపుతున్నాడు. కెవ్వు కార్తీక్ స్కిట్‌లో కొత్త అమ్మాయితో నరేష్ ట్రాక్ నడపేందుకు ప్రయత్నించిన అది వర్కవుట్ కాలేదు. పలు కారణాల వలన కార్తీక్ లవర్ నరేష్ దగ్గరకు, నరేష్ లవర్ కార్తీక్ దగ్గరకు వెళ్లగా,ఈ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సన్నివేవాలు ప్రేక్షకుకలి పసందైన వినోదాన్ని పంచాయి. అంతేకాదు ఈ కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వేలా చేసింది.
బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ షో ఎంతోమందిని ఆర్టిస్ట్ లుగా మార్చి మంచి హోదాలో ఉండేలా చేసింది. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకునేలా కూడా చేసింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క కమెడియన్లు మంచి పేరు సంపాదించుకోగా.. ఇందులో ఒకరు పొట్టి నరేష్ కూడా తన కామెడీ టైమింగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే పొట్టి నరేష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడని కొన్ని నిజాలు బయటపడ్డాయి.

Jabardasth Naresh rmance with new artist
Jabardasth Naresh : కామెడీ కెవ్వు కేక..
చూడటానికి మూడు అడుగులు ఉండే పొట్టి నరేష్ తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో ఢీ జూనియర్స్ లో పాల్గొనగా.. ఆ తర్వాత సునామి సుధాకర్ జబర్దస్త్ లో అవకాశం వచ్చేలా చేశాడు. అలా కొన్నాళ్ళు చంటి టీమ్ లో చేయగా.. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేరి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. కొన్ని కొన్ని సార్లు లేడీ గెటప్ లో కూడా వచ్చి బాగా రచ్చరచ్చ చేస్తుంటాడు. ఇదంతా పక్కన పెడితే నరేష్ శాంతి స్వరూప్‌తో కూడా రొమాన్స్ చేస్తూ తెగ అలరిస్తున్నాడు. కామెడీలో భాగంగా వీరిద్దరు తాజాగా చేసిన స్కిట్ కడుపుబ్బ నవ్వించింది.