Rashmi Gautam : వెరైటీ నగలతో.. రష్మి గౌతమ్ వగలమారి హోయలు..

Authored By mallesh | The Telugu News | Published on: December 17, 2021, 8:15 am

Rashmi Gautam : బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మానవతావాదిగా నోరులేని మూగ జీవాలకు సాయం చేయాలని రష్మి గౌతమ్ చాలా సార్లు తెలిపింది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో కుక్కలకు తన సొంత డబ్బులతో ఫుడ్ తయారు చేయించి మరి అందజేసి తన మానవత్వాన్ని చాటుకుంది రష్మి.. ఈ సంగతులు అలా ఉంచితే.. సోషల్ మీడియా వేదికగా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Rashmi Gautam : స్లీవ్ లెస్ బ్లౌజ్, చేనేత శారీలో అలా నవ్వుతూ ఫోజులు..

rashmi gautam shared her latest photos in social media which got viral in internet

rashmi gautam shared her latest photos in social media which got viral in internet

సోషల్ మీడియా వేదికగా షేర్ అయిన సదరు ఫొటోల్లో రష్మి గౌతమ్.. ఓ పక్క సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో కుందనపు బొమ్మలా కనబడుతూనే .. మరో వైపున స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గ్లామరస్ క్వీన్‌గా కనబడుతోంది. ఈ క్రమంలోనే ఆమె చెవులకు ధరించిన బుట్టాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఈ ఫొటోలు చూసి నగలతో రష్మి గౌతమ్ వగలమారి హోయలు పడుతున్నదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బూడిద రంగు చేనేత చీరలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన రష్మి గౌతమ్ అలా కుర్చీలో కూర్చొని, కొంటెగా చూస్తూ, నవ్వుతూ, ఎద అందాలు చూపుతూ రకరకాల స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ భామ ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్‌పైన ఫోకస్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. రష్మి గౌతమ్ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దాదాపుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రష్మి గౌతమ్‌కు వచ్చిందని, త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp