Rashmi Gautam : యాంకర్ రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ చూసినా ఆమే కనిపిస్తోంది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్నింట్లోనూ తనే కనిపిస్తోంది. రష్మీ ఈ మూడింటిని బాగానే బ్యాలెన్స్ చేస్తోంది. మిగతా వారిలా రష్మీ పక్క చూపులు చూడదు.పక్క వాటికి వెళ్లాలనే ధ్యాస కూడా ఆమెకు ఉండదు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతుంటుంది రష్మీ. అందుకే ఆమెకు మిగతా అవకాశాలు వచ్చిన అంతగా పట్టించుకోదు. కావాలంటే అప్పుడప్పుడు గెస్ట్ అప్పియరెన్స్, స్పెషల్ ఈవెంట్లు ఉంటే మాత్రం వెళ్తుంది. అలా ఓ సారి స్టార్ మా, జీ తెలుగు వంటి షోల్లో రష్మీ సందడి చేసింది. ఇక ఇప్పుడు రష్మీ మల్లెమాలలో ఏకంగా మూడు షోలను హ్యాండిల్ చేస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి సుధీర్ వెళ్లిపోవడంతో ఆ స్థానంలోకి రష్మీ వచ్చింది. రష్మీ రావడం ఏంటో గానీ.. ఆది, రాం ప్రసాద్‌లు మాత్రం ఎప్పుడూ ఆమెను టార్గెట్ చేస్తూనే పంచులు వేస్తున్నారు.
మొన్నటి వరకు బాబు, బాబు అంటూ సుధీర్‌ను అడ్డంగా పెట్టుకుని రష్మీ మీద పంచులు వేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆమె యాంకర్, ఆ పోస్ట్ మీద కన్నేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడూ ఆమెను శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి బయటకు పంపించేద్దామా? అన్నట్టుగా ఆది, రాం ప్రసాద్ చూస్తున్నట్టు అనిపిస్తోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆది, రాం ప్రసాద్‌లు రష్మీ యాంకరింగ్ మీద కామెంట్లు వేశారు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో తీస్ మార్ ఖాన్ సినిమా యూనిట్ వచ్చింది. ఇందులో భాగంగా ఆది, పాయల్ అంతా కూడా డ్యాన్సులు వేశారు. డైరెక్టర్ కూడా స్టెప్పులు వేశారు. ఇలా వారంతా స్టేజ్ మీద సందడి చేస్తుండటంతో.. మన ఈవెంట్‌కు వాళ్లు గెస్టులుగా వచ్చినట్టు లేదు.. వాళ్ల ఈవెంట్‌కు మనం గెస్టులుగా వచ్చినట్టుంది అంటూ ఆది కౌంటర్లు వేస్తాడు.
ఇక నువ్ కూడా అక్కడేందుకు.. డైరెక్టర్ వచ్చి యాంకరింగ్ చేస్తాడు అని రష్మీని పిలుస్తాడు ఆది. అమ్మో ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను.. అంత ఈజీగా వస్తానా? అని రష్మీ అంటుంది. రావడం కష్టం.. వెళ్లడం ఈజీనే అని ఆది అంటాడు. రావడం కష్టం.. వెళ్లడం కూడా కష్టం.. పంపించడం ఈజీ అని రాం ప్రసాద్, ఆది అంటారు. అవును పంపించడంలో మీరే ముందుంటారు కదా? అని రష్మీ సెటైర్లు వేసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.