
Why did anr not agree to Nagarjuna marriage with Amala?
తెలుగు చిత్రసీమలో అగ్ర కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళ లాంటి వారు. ఏఎన్నార్ కుటుంబానికి చిత్రసీమతో దాదాపు 60 ఏళ్ల అనుబంధం ఉంది. ఏఎన్ఆర్ నుంచి నేటితరం హీరో అఖిల్ వరకు చిత్ర సీమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్.
తెలుగు చిత్రసీమలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరావు. అయన తర్వాత వారసుడుగా ఆయన కుమారుడు నాగార్జున సినీ రంగంలోకి ప్రవేశించాడు. నాగార్జున సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా దిట్ట. ఎప్పుడు వ్యాపారం చేయాలి ఏ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో ఆయనకు తెలియనిది కాదు. సినిమాలు, బిజినెస్ లల్లో ఆరితేరిన నాగార్జున మొదటి పెళ్లి విషయంలో రాంగ్ స్టెప్ వేశాడని ఏఎన్ఆర్ అప్పట్లో నమ్మాడట. నాగార్జున మొదటి వివాహం డి.రామానాయుడు కుమార్తె శ్రీ లక్ష్మితో జరిగింది. నాగార్జున సినిమాల్లోకి రాకముందే శ్రీలక్ష్మి తో వివాహం జరిగింది. ఈ దంపతులకు నాగచైతన్య పుట్టాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి శివ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలను పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. నాగార్జున అమల పెళ్లి చేసుకోవడం ఏఎన్నార్ కు ఏ మాత్రం ఇష్టం లేదట.
Why did anr not agree to Nagarjuna marriage with Amala?
ఈ రంగంలో ఉన్న వారి జీవితాలు వ్యక్తిగతంగా క్రమశిక్షణతో సాగవని ఆయన నమ్మేవాడట. ఏఎన్ఆర్ సినిమా రంగంలో ఉండటంతో ఆయనకు ఎవరు పిల్లని ఇచ్చేవారు కాదట. ఆయన సొంత మేనమామలు కూడా ఆయనకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదట దీంతో ఆయనకు లేటు వయసులో పెళ్లి అయిందట. అందుకే అమలను తన ఇంటి కోడలిగా చేసుకోవడానికి నాగేశ్వరావు ఇష్టం లేదట. దీనికి తోడు ఆమె తెలుగు అమ్మాయి కాకపోవడంతో నాగార్జున అర్థం చేసుకుంటుందా లేదా అన్న సందేహం నాగేశ్వరరావు ఉండేదట. అయితే చివరకు నాగార్జున ఇష్టాన్ని కాదనలేక ఏఎన్ఆర్ నాగార్జున అమల పెళ్ళికి చివరకు ఒప్పుకున్నాడట. ఆ తర్వాత అమల అక్కినేని కుటుంబ వంశ గౌరవాన్ని కాపాడుకుంటూ కుటుంబంలో ఉన్న సభ్యురాలిగా మంచి స్థానాన్ని సంపాదించుకుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.