Home » Entertainment » Rashmi Gautham Remuneration Hot Topic Now
Entertainment

Rashmi Gautam : ర‌ష్మీ గౌత‌మ్ ఒక్క షోకి తీసుకునే రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: May 21, 2022 5:44 pm
Advertisement

Rashmi Gautham : బుల్లితెర గ్లామ‌ర్ యాంకర్ రష్మీ గౌతమ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు యాంకర్ అయినా ఆమెకు స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ ఉంది. యాంకర్ గా పిచ్చ గ్లామర్ దక్కడంతో హీరోయిన్ గా ప్రమోషన్ కూడా దక్కింది. త‌న గ్లామ‌ర్‌ను న‌మ్ముకుని సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేద్దామ‌ని ప్ర‌య‌త్నించిన ర‌ష్మీ గౌత‌మ్.. హీరోయిన్‌గా కాదు క‌దా.. సైడ్ క్యారెక్ట‌ర్స్ కూడా పెద్ద‌గా ద‌క్క‌లేదు. దీంతో ఆమె సిల్వ‌ర్ స్క్రీన్ నుంచి త‌ట్టా బుట్టా స‌ర్దేసుకున్న స‌మయంలో బుల్లితెర నుంచి ఆమెకు అవ‌కాశాలు వ‌చ్చాయి. జ‌బ‌ర్ధ‌స్త్, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్‌ద‌స్త్‌, ఢీ డాన్స్ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా పోయింది. బుల్లితెర మీద‌నే కాదు.. సోష‌ల్ మీడియాలో అందాల‌ను ప్ర‌దర్శ‌న చేస్తూ కుర్ర కారుని తిక మ‌క పెట్టేస్తుందీ ముద్దుగుమ్మ‌.

Advertisement

ర‌ష్మీ రెమ్యున‌రేష‌న్‌..

ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు. ఇక అది అలా ఉంటే రష్మి గౌతమ్ రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు రష్మి గౌతమ్ ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇది తెలుసుకొని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ర‌ష్మీ అంత‌గా సంపాదిస్తుందా అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Rashmi Gautam remuneration News

రష్మీ అంటే వెంటనే గుర్తు వచ్చే మరో పేరు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ వేదికగా వీరు లవర్స్ అనే ఓ రూమర్ తెరపైకి వచ్చింది. ఈ ఎఫైర్ పై ప్రేక్షకులు అత్యంత ఆసక్తి చూపడంతో దానిని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. దాదాపు 9ఏళ్లుగా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేమికులుగా చలామణి అవుతున్నారు. ఇది కెరీర్ కోసం, ఈవెంట్స్ కోసమే అనేది వాళ్ళ సన్నిహితులకు మాత్రమే తెలిసిన నిజం. రష్మీ, సుధీర్ ఈ విషయాన్ని ధృవీకరించినా, వాళ్ళ మధ్య ఏదో ఉందని నమ్మే వాళ్ళు లేకపోలేదు.ఏదేమైన ర‌ష్మీ మాత్రం దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే పాల‌సీని చ‌క్క‌గా పాటిస్తుంది. ఈ అమ్మ‌డు భోళా శంక‌ర్ అనే చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి