
శ్రీదేవి బయోపిక్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా ..? అవుననే బీ టౌన్ లో వినిపిస్తోంది. శ్రీదేవికి టాలీవుడ్ .. బాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా అభిమానులున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ ని తెరకెక్కించాలని శ్రీదేవి భర్త.. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ గత కొంతకాలంగా సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా శ్రీదేవి బయోపిక్ గనక తెరకెక్కిస్తే ఖచ్చితంగా పాన్ ఇండియన్ రేంజ్ లోనే నిర్మిస్తారనడం లో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాదు శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ సినిమాలు ప్రధానంగా చేసింది. అంటే మహానటి సావిత్రి తర్వాత మళ్ళీ సినీ తారల బయోపిక్ గనక తీస్తే అది శ్రీదేవి బయోపిక్ కే ఆ అవకాశం ఉంది. శ్రీ జీవితంలో ఎన్నో విషయాలు బయటకి తెలియనివి ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. శ్రీదేవి బయోపిక్ లో తన సినీ జీవితం తో పాటు ఖచ్చితంగా వ్యక్తిగత జీవితంలోని విశేషాలను వెండితెరమీద ఆవిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఈ బయోపిక్ లో శ్రీదేవి పాత్ర పోషించగలిగే సత్తా ఉన్న హీరోయిన్ ఉన్నారా అన్నది చాలామంది శ్రీదేవి అభిమానుల్లో ఉన్న సందేహం.
ఎంత మేకోవర్ చేసినా శ్రీదేవి ని కాస్త అయినా కొన్ని ఫ్రేంస్ లో అయిన మ్యాచ్ చేయగలిగే వెల్ నోన్ ఫెమీలియర్ యాక్ట్రెస్ కావాలి. కాని అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు. శ్రీదేవీ బయోపి ప్లానింగ్ కి సమస్యలు ఎదురవడానికి ఈ కారణం కూడా ఒకటి అని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ బయోపిక్ రూపొందించేందుకు బాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలే తప్ప ఖచ్చితంగా ఎలాంటి సమాచారం లేదు. కాని రష్మిక మందన్న మాత్రం తాను ఒకవేళ బయోపిక్స్ లో నటించాల్సి వస్తే శ్రీదేవీ లేదా సౌందర్య బయోపిక్ లో నటించడానికి రెడీగా ఉన్నట్టు చెప్పింది. మరి దీనిపై శ్రీదేవి డైహార్ట్ ఫ్యాన్ రాం గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా అందరి బయోపిక్స్ తీసేందుకు ఆతృత కనబరిచే రాం గోపాల్ వర్మ శ్రీదేవీ బయోపిక్ ని ఎందుకు ప్లాన్ చేయడం లేదన్నది చాలామందికి అర్థం కాని ప్రశ్న.
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
This website uses cookies.